సినిమా పాయె..డబ్బూ పాయె

చేయక చేయక సినిమా చేసాడు అక్కినేని ఫ్యామిలీలో బ్యాడ్ లక్ ను భుజాన వేసుకున్న హీరో సుమంత్. పాపం, వైవిధ్యమైన సబ్జెక్ట్, జనం ఆదరిస్తారేమో అనుకుని, తను పారితోషికం కూడా వదిలేస్తున్నాడు. నరుడా డోనరుడా సినిమా చేసాడు. అన్నపూర్ణ సదుపాయాలు ఫ్రీగా అందాయి. 

అయినా కూడా సినిమా విడుదలకు ముందు రోజు నానా సమస్యలు ఎదుర్కొందని వినికిడి. ఇక సినిమా విడుదల కాకపోతే, పరువు ప్రతిష్టల సమస్య అని సుమత్ సోదరి, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహకురాలు సుప్రియ కలుగచేసుకుని, డబ్బులు సర్దుబాటు చేసారట రాత్రికి రాత్రి. అప్పుడు కానీ సినిమా బయటకు రాలేదు. 

సినిమా ఆడితే డబ్బులు వెనక్కు తీసుకోవచ్చు అనుకున్నారట సుప్రియ. కానీ పాపం, సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణంగా పల్టీ కొట్టేసింది. దాంతో ఇటు సుమంత్ రెమ్యూనిరేషన్, సుప్రియ అడ్జస్ట్ మెంట్ అమౌంట్ అన్నీ గాలికిపోయాయట.

Show comments