పవన్‌కళ్యాణ్‌కి వున్న సినీ గ్లామర్ నేపథ్యంలో 2014 ఎన్నికల ప్రచారానికి ఆయన్ని బీజేపీ - టీడీపీ పిలుచుకున్నాయి. అంతకు ముందే ఆయన స్థాపించిన జనసేన పార్టీని, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ప్రపంచానికి పరిచయం చేసేశాయి కూడా. 'పవన్‌కళ్యాణ్ తక్కువేమీ తిన్లేదు, టీడీపీ - బీజేపీకి ఓటెయ్యండి.. ఆ రెండు పార్టీలూ అధికారంలోకి వచ్చాక, ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోలేకపోతే మీ తరఫున నేను ప్రశ్నిస్తా..' అంటూ హంగామా చేసేశారు.
ఏమయ్యిందిప్పుడు.? అసలు, జనసేన పార్టీ ఎన్డీయేలో భాగస్వామి కాదంటూ బీజేపీ తేల్చేసింది. 'జనసేన మాకు మిత్రపక్షమో కాదో పవన్‌కళ్యాణ్ తేల్చుకోవాలి..' అని ఓసారి, అసలు పవన్‌కళ్యాణ్, ఎన్డీయేలో భాగస్వామి కానే కాదని ఇంకోసారి బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ సిద్దార్ధనాథ్ సింగ్ పదే పదే టార్గెట్ పవన్‌కళ్యాణ్ అనే మిషన్‌ని అమలు చేసేస్తున్నారు గట్టిగానే.
తాజాగా, పవన్‌కళ్యాణ్ మీద మరో సెటైర్ వేసేశారు సిద్దార్ధనాథ్‌సింగ్. 'పవన్‌కళ్యాణ్ సినిమాలకి నిధుల కొరత వుందేమోగానీ, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇచ్చే నిధులకు ఎలాంటి కొరతా లేదు..' అని సెలవిచ్చారాయన. అబ్బో, ఇదేదో బాగుందే.! అక్కడికి పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయినట్లు.. రాజధాని నిర్మాణానికి ఇబ్బడిముబ్బడిగా కేంద్రం నిధులు ఇచ్చేసినట్లు చెప్పేసుకుంటున్నారు సిద్దార్ధ నాథ్ సింగ్.
పైగా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారంటే దానికి ఆటోమేటిక్‌గా చట్టబద్ధత వచ్చేసినట్లేనన్నది సిద్దార్ధనాథ్‌సింగ్‌గారి వాదన. అవునా.? కేంద్ర ఆర్థిక మంత్రి ప్రెస్‌మీట్‌లో చెప్పిన మాటకే చట్టబద్ధత వుంటే, ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్, రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి చట్టబద్ధత ఎందకు వుండదట.? పవన్ విషయంలో లాజిక్కులు లాగిన సిద్దార్ధనాథ్‌సింగ్, ప్రత్యేక హోదా విషయంలో లాజిక్ మర్చిపోతున్నారు మరి.!
అంతా బాగానే వుందిగానీ, పవన్‌కళ్యాణ్ సినిమాలకి నిధుల కొరత వుందా.? ఈ ఆరోపణ సిద్దార్ధ నాథ్ సింగ్ ఎందుకు చేశారట.? అంటే, దానికీ ఓ లెక్కుంది. అదేంటంటే, 'నా దగ్గర డబ్బుల్లేవు.. మీరు నా సినిమాల్ని గట్టిగా చూడండి..' అంటూ కాకినాడ బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్ ఓ డైలాగ్ పేల్చారు. ఆ మాటకొస్తే, పవన్ పదే పదే బహిరంగ సభల్లో డబ్బుల్లేవనే మాట చెబుతున్నారు. బహుశా దానికి సెటైర్ సిద్దార్ధనాథ్ సింగ్ ఇలా వేశారేమో.
సిద్దార్థ నాథ్ సింగ్ సెటైర్‌కి, పవన్‌కళ్యాణ్ రిటార్ట్ ఇస్తారా.? ఏమో, అయ్యగారు ఇంకో బహిరంగ సభ పెట్టడానికి ఎన్నాళ్ళు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.