రెజినా చుక్కలు చూపించేస్తుందా?

రెజినా అంతే.. ఏ సినిమాలో చేసినా సరే, హాట్‌ అండ్‌ స్పైసీ అనే రేంజ్‌లో వుంటుంది. కృష్ణవంశీ సినిమాలో ఇంకెలా రెచ్చిపోతుందో కదా.! చిన్న టీజర్‌ వదిలాడు కృష్ణవంశీ రెజినాకి బర్త్‌ డే విషెస్‌ కాస్త ఆలస్యంగా చెబుతూ. అన్నట్టు, సారీ కూడా చెప్పేశాడండోయ్‌ 'నక్షత్రం' టీమ్‌ తరఫున శుభాకాంక్షలు ఆలస్యంగా చెబుతున్నందుకు. 

సరే, బర్త్‌ డే విషెస్‌ సంగతి పక్కన పెడితే, ఈ టీజర్‌లో రెజినా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఎందుకు రెచ్చిపోదూ, కృష్ణవంశీ సినిమాల్లో దాదాపుగా హీరోయిన్లు ఇలానే వుంటారు. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా తీసుకుంటే, అందాల చందమామ కాజల్‌ సినిమాలన్నిటిలోకీ గ్లామరస్‌ పరంగా పీక్స్‌కి తీసుకెళ్తుందా సినిమా. 'శ్రీఆంజనేయం' సినిమాలో ఛార్మి అయినా, చాలాకాలం క్రితం వచ్చిన 'సింధూరం' సినిమాలో సంఘవి అయినా అంతే. దాదాపుగా కృష్ణవంశీ సినిమాల్లోని హీరోయిన్లంతా సూపర్‌ హాట్‌గా వుంటారు. అదో సిగ్నేచర్‌ అనుకోవాలంతే. 

ఇప్పుడు, 'నక్షత్రం' సినిమాలో రెజినా కూడా చాలా హాట్‌గా కన్పించబోతోంది. ఎంతలా.? అంటే, మునుపెన్నడూ లేనంత హాట్‌గా. డౌటేమన్నా వుందా.? జస్ట్‌ 'నక్షత్రం' టీమ్‌ రెజినాకి బర్త్‌ డే విషెస్‌ చెబుతూ విడుదల చేసిన వీడియో ప్రోమో ఇంకోసారి చూడండి. సందీప్‌ కిషన్‌, రెజినా ఈ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. మరోపక్క సాయిధరమ్‌తేజ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరవనున్నాడు.

Show comments