నారా రోహిత్ మారాల్సిందే

నారా రోహిత్ మారాలి అంటే, మనిషి సన్నంగా తయారవడమో, మరోటో కాదు. సినిమాలు చేసే విషయంలో. నారా రోహిత్ దగ్గర సమస్య ఏమిటంటే, సబ్జెక్ట్ నచ్చితే చాలు. నిర్మాత కెపాసిటీ ఏమిటన్నది చూడడు. తనకు ఏం ఇస్తాడన్నది చూడడు. శాటిలైట్ రైట్స్ వదిలేస్తాం సార్..అంటే సరే అనేస్తాడు. కానీ సినిమాలు ప్రారంభమై, సరైన టైమ్ కు ఫినిష్ కావు, సరైన టైమ్ కు విడుదల కావు. సగం చేసిన తరువాత నిర్మాత చేతులెత్తేస్తాడు. దాంతో సబ్జెక్ట్ మీద ప్రేమతోనో, దర్శకుడి ఆబ్లిగేషన్ తోనో నిర్మాణంలో చేతులు పెడతాడు. 

అలా అలా జనం మరిచిపోయాయక సినిమా బయటకు వచ్చి ఏం ప్రయోజనం. గతంలో ఒకటి రెండు సినిమాలు అలాగే అయ్యాయి. ఇప్పుడు శంకర సినిమా పరిస్థితి కూడా అదే. టేకోవర్ చేసిన నిర్మాత సినిమా విడుదలైంది అనిపిస్తే చాలు అనుకుంటున్నారు. జనాలకు రీచ్ అవుతోందా లేదా అన్నది చూడడం లేదు. ఇదే శంకర సినిమా కథ మిగిలిన భాషల్లో వీర హడావుడి చేసింది. ఇక్కడ మాత్రం ఈ వారం విడుదలవుతున్నట్లే చాలా మందికి తెలియదు. అప్పటికీ ఆశ వదలకుండా రోహిత్ స్వయంగా మీడియా ముందుకు వచ్చాడు.

ఇక కథలో రాజకుమారి సినిమా పరిస్థితి అంతే. సగానికి పైగా ఫినిష్ చేసి నిర్మాత చేతులెత్తారు. కార్తికేయ సినిమా విడుదల సమయంలో జరిగిన వ్యవహారాలు తెలిసీ నారా రోహిత్ ఎలా అవకాశం ఇచ్చారో ఆ సంస్థకు ఆయనకే తెలియాలి. ఇప్పుడు ఏమయింది సినిమా ఆగిపోయింది. మళ్లీ దానికో నిర్మాతనన్నా చూడాలి. రోహిత్ స్వంత పెట్టుబడి అన్నా పెట్టాలి.

ఏడాదికి ఒక్క సినిమా చేసినా, సరైన నిర్మాతకు చేయాలి. సరైన సబ్జెక్ట్ వుంటే కాదు. నిర్మాత కూడా అవసరమే. సాయి కొర్రపాటి కాబట్టి జ్యొ అచ్యుతానంద సినిమాను నిలబెట్టగలిగారు. అందువల్ల ఇకనైనా నారా రోహిత్ మారాలి. Readmore!

Show comments