జెనీలియా.. ఎందుకింత ఆరాటం!

చాలా పెద్దింటికి కోడలిగా వెళ్లినా.. జెనీలియాకు సినిమాలపై ఆసక్తి పోలేదు. ప్రేమలో ఉన్నప్పుడు గ్లామరస్ పాత్రల్లో నటించిన ఈమె.. వివాహం, ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం హీరోయిన్ గా నటించడానికి ఉబలాటపడుతోంది. అందుకు తగ్గట్టుగా.. బాలీవుడ్ లో, తను ఒకప్పుడు స్టార్ గా వెలిగిన తెలుగు, తమిళ భాషల్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నించింది. పాత పరిచయాలన్నింటి ఇన్ ఫ్లుయన్స్ నూ ఉపయోగించి అవకాశాల వేట సాగించింది.

అయితే దక్షిణాదిన వివాహం అయిన హీరోయిన్లు అవకాశాలు సంపాదించడం అంటే చాలా కష్టమైన పని. అందులోనూ పిల్లలు పుట్టాకా అంటే అక్కా, వదిన పాత్రలు దక్కుతాయి తప్ప, కూసంత ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా సదరు వివాహితతో నటించడానికి ఇష్టపడడు. అదేమంటే ప్రేక్షకులు చూడరని తేల్చేస్తారు.

ఒకప్పుడు తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో లవ్ సినిమాల్లో కుర్ర హీరోలతో కలిసి సౌత్ ను ఊపేసిన జెనీలియా విషయంలో కూడా అదే జరిగింది. తన పాత హీరోలను సంప్రదించినా అవకాశాలు రాలేదు. కానీ ఒక అవకాశం మాత్రం సంపాదించగలిగింది. అది జీవీ ప్రకాష్ కుమార్ సరసన! 

అంతగా గుర్తింపు లేని హీరోయిన్లతో.. ఏవో చోటా చోటా సినిమాలు చేసుకునే జీవీ సినిమాతో జెనీలియా రీ ఎంట్రీ ఇస్తోందట. మరి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇంటి కోడలికి, బొమ్మరిల్లు వంటి సెన్షనల్ హిట్స్ లో నటించిన హీరోయిన్ గౌరవంగా క్యారెక్టర్ ఆర్టిస్టు వేషాలనో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలనో చేసి ఉంటే బావుండేది. ఈ జీవీ సినిమాలో నటించినా.. అది హిట్టైనా.. ఆమెకు అవకాశాల పంట ఏమీ పండదని వేరే చెప్పనక్కర్లేదు. అయిననూ.. జెన్నీకి ఏలనో ఈ ఆరాటం!  Readmore!

Show comments