'కబాలి'.. అభిమానుల కోసం వచ్చేస్తున్నాడు

రజనీకాంత్‌ ఎక్కడ.? ఈ ప్రశ్న అభిమానుల్ని వేధిస్తోంది. అనారోగ్యంతో విదేశాలకు రజనీ వెళ్ళాడన్న వార్త వారిని తీవ్ర ఆంగోళనకు గురిచేస్తోంది. అదిగో రజనీకాంత్‌.. ఇదిగో రజనీకాంత్‌.. ఆయన ఆరోగ్యంగా వున్నారు.. వైద్య పరీక్షల కోసమే ఆయన విదేశాలకు వెళ్ళారు.. వచ్చేస్తున్నారు.. అంటూ 'కబాలి' దర్శక నిర్మాతలు, రజనీకాంత్‌ కుటుంబ సభ్యులు చెబుతూనే వస్తున్నా, అభిమానుల్లో ఆందోళన మాత్రం తగ్గడంలేదు. 

తన సినిమా ప్రమోషన్‌ కోసం ఇప్పటివరకూ రజనీకాంత్‌ మీడియా ముందుకు రాకపోవడంతో అభిమానుల ఆందోళన రెట్టింపవడం సహజమే. కానీ, రజనీకాంత్‌ మీడియా ముందుకు రాలేని పరిస్థితి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన వున్నారన్నది నిర్వివాదాంశం. అవేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, రజనీకాంత్‌ అభిమానులకు తీపి కబురేంటంటే.. రజనీకాంత్‌ వచ్చాకనే, ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాతే, అభిమానులకు కనిపించాకనే 'కబాలి' సినిమా విడుదల చేస్తారట. అది కూడా అతి తక్కువ రోజుల్లోనేన్నది 'కబాలి' టీమ్‌ నుంచి లేటెస్ట్‌గా బయటకు వస్తోన్న అప్‌డేట్‌. 

ఓ వారం రోజులపాటు 'కబాలి' విడుదలను పోస్ట్‌ పోన్‌ చేయడానికి కారణం కూడా ఇదేనట. ఈలోగా రజనీకాంత్‌ ఓ వీడియో బైట్‌ని అభిమానుల కోసం విదేశాల నుంచే పంపించనున్నట్లు తెలుస్తోంది. ఈ 'లీక్‌' నిజమే అయితే, అభిమానులకు అంతకన్నా పండగ ఇంకేముంటుంది.?

Show comments