ప్రభాస్ జాతకాలు చెపుతాడా?

హీరో ప్రభాస్ మహర్జాతకుడు. అందులో సందేహంలేదు. అందువల్లే నాన్న, పెదనాన్న వల్ల కాలేనిది, ఆ మాటకు వస్తే చాలా మంది హీరోలకు సాధ్యం కానిది సాధించాడు.

బాహుబలి సిరీస్ తో ఫేమస్ అయిపోయాడు. అనేక రికార్డులు స్వంతం చేసుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు జనాల జాతకాలు చెప్పబోతున్నాడట. మళ్లీ జాతకాలు అంటే గ్రహాలు, నక్షత్రాలు జాతకం కాదు. హస్త సాముద్రికం. అంటే చేతులు చూసి జాతకం చెప్పడం అన్నమాట.

ఏమిటి ఇదంతా అంటే.,? గోపీకృష్ణ పతాకంపై త్వరలో చేయబోయే సినిమా. యువి మాదిరిగానే గోపీకృష్ణ సంస్థ కూడా ప్రభాస్ స్వంత బ్యానర్ లాంటిదే. ఈ బ్యానర్ పై జిల్ సినిమా అందించిన రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు.

సాహో సినిమా తరువాత ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా సబ్జెక్ట్ పామిస్ట్రీతో టచ్ వున్నది అంట. రొమాంటిక్ సినిమానే కానీ, హీరో కి పామిస్ట్రీలో ప్రవేశం వుంటుందట. అందరి చేతులు చూసి జాతకాలు చెబుతుంటాడట. ఇదేదో వెరైటీగానే వుండేలా వుంది.

Show comments