నెక్ట్స్‌ మెగాస్టార్‌ ఎవరు? నెటిజన్లు ఏమంటున్నారంటే..

టాలీవుడ్‌లో మెగాస్టార్‌ ట్యాగ్‌ విలువ తెలిసిన ప్రేక్షకుల ముందు నెక్ట్స్‌ మెగాస్టార్‌ ఎవరు? అనే ప్రశ్నను ఉంచగా భిన్నమైన సమాధానాలు వచ్చాయి. లీడింగ్‌ హీరోలను ఛాయిస్‌గా ఇచ్చి సమాధానం చెప్పమనగా ఇందులో ఎన్టీఆర్‌ లీడ్‌లో నిలవడం గమనార్హం.

మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ తేజ, ప్రభాస్‌ అనే ఛాయిస్‌తో నిర్వహించిన ఈ పోల్‌లో తారక్‌ ముందున్నాడు. పోల్‌లో దాదాపు ముప్పైశాతం ఓట్లతో ఎన్టీఆర్‌ ఎక్కువ ఆదరణను పొందాడు. కొన్ని వేలమంది నెటిజన్ల అభిప్రాయాలను ర్యాండమ్‌ శాంపిల్స్‌గా తీసుకుని జరిగిన సర్వే ఇది. దాదాపు 30శాతం ఓట్లను ఎన్టీఆర్‌ పొందాడు.

ఇక ఎన్టీఆర్‌కు అత్యంత సమీపంలో ఉన్నాడు మహేశ్‌ బాబు. వీరిద్దరి మధ్యన తేడా కేవలం రెండుశాతం ఓట్లు మాత్రమే. దాదాపు 28శాతం ఓట్లతో ఎన్టీఆర్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు మహేశ్‌. వీరిద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉండగా.. చాలా దూరంలో నిలిచాడు రామ్‌చరణ్‌ తేజ. దాదాపు 22శాతం ఓట్లతో చెర్రీ ఈ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. మహేశ్‌, ఎన్టీఆర్‌కు మెగాస్టార్‌ తనయుడు తీవ్రమైన పోటీ ఇచ్చే పరిస్థితి లేదు.

నాలుగో స్థానంలో ఉన్నాడు ప్రభాస్‌. దాదాపు 15శాతం ఓట్లను పొందాడు ఈ హీరో. ఈ ఆన్‌లైన్‌ సర్వే ప్రభాస్‌ను నెక్ట్స్‌ మెగాస్టార్‌ రేసులో వెనుకపడేసింది. ఈ రేసులో చివరి స్థానంలో నిలిచాడు అల్లుఅర్జున్‌. కేవలం ఏడుశాతం(దాదాపు) మంది మాత్రమే అల్లుఅర్జున్‌ నెక్ట్స్‌ మెగాస్టార్‌గా గుర్తించారు. నెక్ట్స్‌ మెగాస్టార్‌ అనే చర్చకు తెరలేవడానికి కారణమైన ఈ హీరో ఇంత వెనుకబడటమే కొసమెరుపు.

Show comments