ధృవ కు సెన్సార్ పాజిటివ్ టాక్

థని ఒరువన్ లాంటి క్లాసీ థ్రిల్లింగ్ సినిమాను టేకప్ చేసారు రామ్ చరణ్-సురేందర్ రెడ్డి ద్వయం. ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుని, డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమయింది. సినిమా చాలా బాగా వచ్చిందన్నది సెన్సారు టాక్ గా వినిపిస్తోంది. 

సురేందర్ రెడ్డి స్టయిల్ టేకింగ్, రామ్ చరణ్ మేకోవర్ అన్నింటికి మించి, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ప్లస్ పాయింట్లు గా వున్నాయని వినిపిస్తోంది. సినిమా నిడివి కాస్త ఎక్కువే. 2గంటల.44 నిమషాలు. సినిమా క్లయిమాక్స్ విషయంలో కాస్త మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. 

రామ్ చరణ్ లుక్ లో ఛేంజెస్, రకుల్ అందాలు కూడా ఆకట్టుకునేలా వున్నాయంటున్నారు. సాధారణంగా సెన్సారు జరిగిన తరువాత రెండు మూడు రకాల టాక్ లు వినిపిస్తుంటాయి. ధృవకు కాస్త యునానిమస్ టాక్ వినిపించడం విశేషం.

Show comments