బాలయ్యకు ఏం చెప్పి ఒప్పించాడబ్బా...

కొందరు హీరోల్ని ఎలా ఒప్పించవచ్చో, కథలతో ఎలా మెప్పించవచ్చో పూరి జగన్నాధ్ ఓ సందర్భంలో ఓపెన్ గానే చెప్పేశాడు. సీన్ లో తుపాకులుంటే పవన్ ఓకే చెప్పేస్తాడని, భారీ డైలాగులుంటే ఎన్టీఆర్ ఒప్పుకుంటాడని.. ఇలా చాలామంది హీరోల గురించి చెప్పేశాడు. అయితే కెరీర్ లో ఇప్పటివరకు బాలకృష్ణతో సినిమా చేయని పూరి జగన్నాధ్.. నటసింహానికి ఏం చెప్పి ఒప్పించాడనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. బాలయ్య-పూరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కథ ఏమై ఉంటుందా అనే చర్చ పీక్ స్టేజ్ లో సాగుతోంది. 

బాలయ్య అంటే యాక్షన్, ఫ్యాక్షన్ ఉండాల్సిందే. రౌద్రంగా డైలాగ్ చెప్పాలి లేదంటే తొడ కొట్టాలి. ఇలాంటివి పూరి జగన్నాధ్ వల్ల కాదు. పూరి సినిమాల్లో హీరోవన్నీ పోకిరి వేషాలు, అమ్మాయి వెంట పడ్డంలాంటివే ఉంటాయి. సో... కథల పరంగా చూసుకుంటే బాలకృష్ణ, పూరి జగన్నాధ్ లు కలవని రైలుపట్టాలు. ఇలాంటి రెండు భిన్నధృవాలు కలిసి ఇప్పుడు సినిమా చేస్తున్నాయంటే ఆ స్టోరీ ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందర్లో కలిగింది. 

అయితే ప్రస్తుతానికైతే స్టోరీని మాత్రం రివీల్ చేయడం లేదు పూరి జగన్నాధ్. అందరు హీరోల్ని ఒప్పించినట్టే ఓ యూనిక్ పాయింట్ చెప్పి బాలయ్యను పూరి జగన్నాధ్ ఒప్పించాడనే విషయం మాత్రం తెలుస్తోంది. ఆ పాయింట్ ఏంటనేది పక్కపెడితే... త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమా కథను పూరి జగన్నాధ్  పూర్తిచేశాడా లేక సెట్స్ పైకి వెళ్లిన తర్వాత సీన్లు రాసుకుంటాడా అనే టెన్షన్ లో నందమూరి అభిమానులున్నారు.

ఏదేమైనా ఈమధ్య కాలంలో సక్సెస్ కు దూరమైన పూరి జగన్నాధ్.. బాలయ్య సినిమాను  కాస్త జాగ్రత్తగానే తీస్తాడని తమనుతాము సర్దిచెప్పుకుంటున్నారు. Readmore!

Show comments

Related Stories :