బాలీవుడ్ అంటే మనకి మహా ఆరాధన. మన టాలీవుడ్ జనాలే మీడియాతో ఆడుకుంటారంటే, బాలీవుడ్ జనాలు మరీనూ. హృతిక్ రోషన్ తాజా సినిమా తెలుగు అనువాదం 'బలం' సినిమా కోసం మన మీడియానే వాళ్ల గుమ్మం దగ్గరకు రప్పించుకున్నారట. హృతిక్ రోషన్ ఇక్కడకు వస్తే ఓ రోజు వేస్ట్. పైగా ఆయన, ఆయన మందీ మార్బలం, వాళ్లకి పార్క్ హయాత్ లాంటి హోటళ్లలో బస, ఇతరత్రా ఖర్చులు తడిసి మోపెడవుతుందట.
కానీ తెలుగు నాట కూడా ప్రమోషన్ కావాలి? ఎలా? దాందేముంది, రాను బోను టికెట్ లు ఇచ్చి, ముంబాయిలో ఓ రూమ్ తీసేస్తే, ఇక్కడి నుంచే మీడియాను అక్కడకు తీసుకుపోవచ్చు. అక్కడ హృతిక్ రోషన్ మహా అయితే అరగంట నుంచి గంట స్పేర్ చేస్తే సరిపోతుంది. కానీ ఆయన ఇంటర్వ్యూ కోసం మనం మీడియా మాత్రం ముంబాయి వెళ్లి, ఇంటర్వ్యూ చేసుకుని రావడానికి ఓ రోజు వేస్ట్ చేసుకోవాలి.
హృతిక్ తో ఇంటర్వ్యూ అన్న ఆనందం కోసం ఆ మాత్రం చేసుకోవాలి. తప్పదు. ఈ వీక్ నెస్ బాలీవుడ్ జనాలకు తెలుసు అందుకే ఇలా. నిన్నటికి నిన్న కొన్ని చానెళ్ల జనాలను ముంబాయికి తీసుకెళ్లి తీసుకు వచ్చారట. అయితే కొన్ని చానెళ్లు తాము రామన్నాయని అనడంతో వాళ్లను వదిలేసారని వినికిడి. మొత్తానికి బాలీవుడ్ వాళ్లు గట్టోళ్లే..అవసరం వాళ్లదయినా, మననే అక్కడకు రప్పించడం అంటే అదేగా మరి.