బ్యాంకుల క్యూల్లో జనాలు.. వారిని ప్రతిపక్షాలే పంపాయ్!

అయినా.. ఈ మాటలతో ఏముంది లేండీ, అసలు మనిషి ప్రధానమంత్రే దేశ ప్రజలను అవమానించేశాడిప్పటికే. బ్యాంకుల క్యూలైన్లలో నిలుచున్నది నల్లదొంగలే అని ప్రధాని ఇది వరకే స్పష్టం చేశాడు. నల్లదొంగలను బ్యాంకుల  క్యూల్లో నిలిపాను అని.. అది తన ఘనతగా చెప్పుకున్నాడు. క్యూలైన్లలో నిలుచున్న సామాన్య ప్రజానీకం ప్రధాని మాటలను విని తెల్లబోతోంది. 

దేశంలో ఎక్కడా ఒక్క రాజకీయ నేత క్యూల్లో నిలబడలేదు, ఒక్క ప్రముఖ వ్యాపార వేత్తా ఎక్కడా ఇలా కనిపించలేదు.. క్యూల్లో ఉన్న అర్భకులు మాత్రం ప్రధానికి నల్లదొంగల్లా కనిపిస్తున్నారు!

ప్రధానమంత్రి మోడీ తల్లి క్యూలో నిలబడి డబ్బు తెచ్చుకున్నారు.. కానీ మరే కేంద్ర మంత్రి కుటుంబీకులూ బ్యాంకుల వద్దకు వచ్చిన దాఖలాలు లేవు. ప్రధాని తల్లిని క్యూ లైన్లో నిలబెట్టి రాజకీయం చేసి.. అంతటితో సంతృప్తి చెందారు కమలనాథులు.

ఆ సంగతలా ఉంటే.. బీజేపీ ఎంపీ ఒకరు మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఎంపీ హోదాలో ఉన్న ఈ నటీమణి మాట్లాడుతూ.. దేశంలో బ్యాంకుల ముందు క్యూల్లో జనాలు పడిగాపులు కాస్తున్నారు కదా.. అంటే, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆమె అంటున్నారు! Readmore!

అదేంటి అంటే.. ప్రతిపక్ష పార్టీలు ఆ జనాలను ఏర్పాటు చేశాయి.. అని రూపా సెలవిచ్చారు! బ్యాంకుల క్యూల్లో నిలబడి ఉన్నది సామాన్యులు కాదని, డబ్బును మార్చుకోవడానికి వెళ్లిన వారు కాదని, రెండు వేల రూపాయల కోసం వెళ్లిన వారు కాదని.. వాళ్లంతా ప్రతిపక్ష పార్టీలు డబ్బులిచ్చి ఏర్పాటు చేసిన మనుషులు. ఈ విధంగా జనాలను బ్యాంకుల ముందు పెట్టి.. దేశంలో ఇబ్బందులు నెలకొన్నాయి అనే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రూప అంటున్నారు.

మరి బాగానే ఉంది ఈమె మాట. మరి ఇదే మాటను.. ఎక్కడైనా ఈమెకు సమీపంలో ఉన్న బ్యాంకు వద్దకు వెళ్లి, అక్కడ క్యూలో ఉన్న వేచి ఉన్న జనాల దగ్గర అంటే సరిపోతుందేమో!  

 

Show comments