పంచె ఊడదీయమన్నావ్ గా పవన్?

పంచె అంటే ఆత్మ గౌరవం..పంచె అంటే హుందాతనం అంటూ నిన్నటికి నిన్న చేనేత కళాకారుల సదస్సులో చాలా మాటలు చెప్పాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే తాను పంచెకడతానని కూడ చెప్పుకొచ్చాడు. కానీ తను కట్టేదాన్ని లుంగీ అంటారని, ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర రెడ్డి, వైఎస్ఆర్ లాంటి వాళ్లు కట్టింది పంచె అని ఆయనకు తెలియకపోవచ్చు. పంచె కట్టడం రాని వారు, లేదా తమిళనాడు, ఆ సరిహద్దు జనాలే లుంగీ స్టయిల్ లో కడతారు. తెలుగు వాడి పంచెకట్టు వేరు. ఆ సొగసు వేరు.

సరే, ఈ సంగతి అలా వుంచితే పంచె అంటే పవన్ కు అంత గౌరవం అని ఇప్పుడే తెలిసింది. కానీ ప్రజారాజ్యం టైమ్ లో ఊరూరా తిరిగి, యువరాజ్యం అధినేతగా స్పీచ్ లు దంచినపుడు మాత్రం పవన్ పంచ్ డైలాగు వేరు. కాంగ్రెస్ నాయకుల పంచెలు ఊడదీసి కొట్టండి అని పిలుపు ఇచ్చింది పవనే. మరి ఇప్పుడు పవన్ పంచెకట్టడం ప్రారంభిస్తే, కాంగ్రెస్ నాయకులో, మరో ప్రత్యర్థి పార్టీ జనాలో అలాంటి పిలుపే ఇస్తే, పరిస్థితి ఏమిటో?

అయినా పవన్ కు ఏ రోటి దగ్గర ఆ పాట పాడడం బాగానే వంట బట్టిందని అర్థమైపోతోంది. అందువల్ల టేకిట్ ఈజీ అనుకోవడమే.

Readmore!
Show comments

Related Stories :