అవసరాలతో సినిమా పక్కా-నాని

ప్రస్తుతం చేస్తున్న నేను లోకల్ సినిమా పూర్తయిన తరువాత చేసే సినిమా అవసరాల శ్రీనివాస్ తోనే వుంటుందని హీరో నాని స్పష్టం చేసారు. అవసరాల అడిగితే తాను కాదనే ప్రసక్తే లేదని, అయితే, అలా అని అవసరాల తనను హర్రీ బర్రీగా అడిగే వ్యక్తి కాదని అన్నారు. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితేనే అవసరాల డేట్లు అడుగుతాడని తనకు తెలుసన్నారు. జ్యో అచ్యుతానంద సినిమా స్క్రిప్ట్ తనకు ముందే చెప్పాడని, అయితే తనను చేయమని మాత్రం అడగలేదని నాని వెల్లడించారు. 

తను ఓ పాత్ర వేస్తే, మళ్లీ రెండో పాత్రకు ఎవరు అన్న విషయం ప్రాబ్లమ్ అవుతుందని, అందుకే తనను అడగడం లేదని అవసరాల ముందే చెప్పేసాడన్నారు. అవసరాల అద్భుతమైన విషయపరిజ్ఞానం వున్న డైరక్టర్ అన్నారు. అతగాడు ఇప్పుడు నటుడిగా రెండు మూడు సినిమాలతో బిజీగా వున్నాడని, అందువల్ల అవి పూర్తి చేసి, స్క్రిప్ట్ రెడీ చేస్తే, తమ కాంబినేషన్ సినిమా వుంటుందన్నారు.

తను రెమ్యూనిరేషన్ పెంచానా లేదా అన్నది పాయింట్ కాదని, తన సినిమా మార్కెట్, సినిమా షేర్, అందులోనే తన రెమ్యూనిరేషన్ ఓ భాగం అని, అవన్నీ విస్తృతి అవుతున్నపుడు ఇదీ మారుతుందని నాని అన్నారు. అష్టాచెమ్మా అప్పుడు ఎలా వున్నానో ఇప్పుడు అలాగే వున్నానని, తన చుట్టూ మారిందేమో కానీ తన ఆటిట్యూడ్ లో మార్పు లేదన్నారు. 

అదే టెన్షన్, బ్యానర్లు కాంబినేషన్ల కన్నా స్క్రిప్ట్ కే కట్టుబడి వుండడం, కొత్తవాళ్లయినా, పాతవాళ్లయినా కథకే ప్రయారిటీ ఇవ్వడం అన్నీ అలాగే వున్నాయన్నారు. జంటిల్ మెన్ టైమ్ లో క్రేజీ ఆఫర్ వచ్చిందని, ఇంకెవరైనా అదే చేస్తారని, కానీ తాను జెంటిల్ మెన్ చేసానని నాని వెల్లడించారు. చాలా మంది ఈ విషయంలో తనను తప్పుపట్టారని కూడా అన్నారు.   Readmore!

తను క్లాస్ సినిమాలు చేస్తానని, ఓవర్ సీస్ లో చూస్తారని క్లాస్ సినిమాలే చేస్తున్నా అని అనుకుంటున్నారమో, కానీ అది కరెక్ట్ కాదని అన్నారు. ఓవర్ సీస్ జనాలకు కూడా మహా మాస్ అని, అయితే సరైన సినిమా చేయాలన్నదే కీలక అని అన్నారు. నేను లోకల్ క్లాస్ కు ఎక్కువ-మాస్ కు తక్కువ అన్నట్లు వుంటుదన్నారు.

సినిమాలు చేస్తూ వుండడం వల్ల తనకు అన్నింటికన్నా లాభం మంచి మంచి పరిచయాలు పెరుగుతున్నాయని, విరించి వర్మ లాంటి మంచి స్నేహితులు దొరుకుతున్నారని నాని అన్నారు. అన్నింటికన్నా అదే పెద్ద లాభం అని ఆయన చమత్కరించారు.  మజ్ఞు సినిమాలో బ్రేకప్ వున్నా, అది ఆడియన్స్ కు మాత్రం వినోదాన్నే అందిస్తుందన్నారు. 

ఈ సినిమాలో చేయడం అంత ఈజీ మరే సినిమాతోనూ లేదని, ఎందుకంటే ఈ సినిమాలో రియల్ గా తను ఎలా వుంటానో అలాగే చేసుకుంటూ పోయాను తప్ప, ప్రత్యేకంగా ఇలా నటించాలి, ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అవసరం లేదన్నారు. అలాంటి లైవ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ దొరికిందని నాని అన్నారు. 

Show comments

Related Stories :