స్వరాలు సిద్దమవుతున్నాయ్

సినిమా ప్రీ పొడక్షన్ వర్క్ లో సాంగ్స్ ట్యూనింగ్ ఒకటి. ఆరు పాటలకు ట్యూన్ లు రావాలంటే, కనీసం అందుకు మూడు రెట్ల ట్యూన్ లు అన్నా రెడీ కావాలి. మ్యూజిక్ డైరక్టర్ క్రియేటివిటీ, డైరక్టర్ అభిరుచి..ఆపైన హీరో విని ఓకే చేయాలి. మహేష్-మురగదాస్ సినిమా పాటల ట్యూనింగ్ షురూ అయింది.

 సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్. ఓ పాట ట్యూనింగ్ ఇంతకు ముందే అయిపోయింది. మరి కొన్ని పాటల ట్యూనింగ్ రేపటి నుంచి చెన్నయ్ లో ప్రారంభమవుతొంది. ఇక సాయిధరమ్ తేజ-గోపీచంద్ మలినేని సినిమా పాటల ట్యూనింగ్ విశాఖలోని ఓ బీచ్ రిసార్ట్ లో గత రెండు రోజులుగా సాగుతోంది. దీనికి సంగీతం ఎస్ ఎస్ థమన్. 

ఇంకోపక్క రాఘవేంద్రరావు-నాగ్ కాంబినేషన్ లోని భక్తిరస చిత్రానికి ట్యూన్ ల పనిని కూడా సోలోగా తనకు తాను ప్రిపేర్ చేసుకుంటున్నారట కీరవాణి. సో..అదీ సంగతి.

Show comments