పూనమ్‌ పాండేని తొక్కేస్తున్నారట

సోషల్‌ మీడియా 'హాట్‌ బాంబ్‌' పూనమ్‌ పాండేకి సూపర్‌ షాక్‌ ఎదురయ్యింది. ఈ మధ్యనే ఓ యాప్‌ని ఆమె విడుదల చేసింది. సోషల్‌ మీడియా వేదికలపై పూనమ్‌ పాండే చేస్తోన్న 'వల్గర్‌ అరాచకం' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ అరాచకానికి ఫిదా అయ్యే సోకాల్డ్‌ 'సెక్సీ అభిమానులూ' లేకపోలేదు. అందుకే, పూనమ్‌ పాండే యాప్‌ విడుదలైన కాస్సేపట్లోనే కుప్పలు తెప్పలుగా డౌన్‌లోడ్‌ చేసేసుకున్నారు ఆ అభిమానులంతా. దాంతో, పూనమ్‌ పాండే పండగ చేసేసుకుంది. 

కానీ, అంతలోనే ఈ యాప్‌ని గూగుల్‌ బ్యాన్‌ చేసేసింది. ఇంకేముంది, షరామామూలుగానే పూనమ్‌ పాండే 'గూగుల్‌'పై విరుచుకుపడింది. 'గూగుల్‌లో చాలా సెక్సీ యాప్స్‌ వున్నాయి.. న్యూడ్‌ యాప్స్‌ కూడా అందుబాటులో వున్నాయి.. అలాంటిది, నా యాప్‌ని ఎందుకు బ్యాన్‌ చేశారో నాకు అర్థం కావడంలేదు..' అంటూ వాపోయింది పూనమ్‌ పాండే. సినిమాల్లో నన్ను తొక్కేద్దామని చూశారు.. సోషల్‌ మీడియాలోనూ అలాంటి ప్రయత్నాలే జరిగాయి.. ఇక్కడా అదే జరుగుతోందంటూ పూనమ్‌ పాండే అసహనం వ్యక్తం చేస్తోంది. 

మొదట ఫేస్‌ బుక్‌, ప్రస్తుతం ట్విట్టర్‌ - ఇన్‌స్టాగ్రామ్‌.. ఇంకా చాలా సామాజిక మాధ్యమాల్లో పూనమ్‌ పాండే హల్‌చల్‌ చేస్తోంది. కొత్తగా పూనమ్‌ పాండే నుంచి ఏ సోషల్‌ మీడియా వేదికలో పోస్టింగ్‌ వచ్చినా, అది సెమీ న్యూడిటీతో కూడుకున్నదే అవుతోంది. వల్గారిటీ కా బాప్‌.. అనే స్థాయిలో పూనమ్‌ పాండే సోషల్‌ మీడియాలో అరాచకం సృష్టించేస్తోంటే, ఆమెపై 'బ్యాన్‌' విధిస్తే తప్పేంటట.? 

Show comments