రాజు-మంత్రిలో ఏంటీ క్లయిమాక్స్?

ఈమధ్య మన హీరోలు, డైరక్టర్లకు కాస్త ధైర్యం వస్తోంది. కొత్తదనం కోసం భిన్నమైన ఆలోచనలు చేస్తున్నారు. బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం కలగడమే ఇందుకు కారణం. ఒకప్పుడు అయితే హీరోలో నెగిటివ్ ఛాయలు వుండాలన్నా, హీరో చనిపోవడం అన్నా భయమే. ప్రేమ్ నగర్ లో హీరోను ఎలాగైనా బతికించేసారు అప్పట్లో. విచిత్ర బంధంలో హీరో రేప్ చేయడం అంటే జనం జీర్ణించుకోలేకపోయారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కథకు అనుగుణంగా పాత్రలను, సంఘటనలను నడిపించితే జనం ఓకే అంటున్నారు.

అందుకే హీరోలు ప్రయోగాలకు సై అంటున్నారు. బాహుబలి తరువాత హీరో రానా చాలా ఇష్టంగా చేస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు రానా అన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది. ఆ మేరకు సినిమాకు మాంచి బజ్ వచ్చింది. అయితే అక్కడితో ఆగకుండా సినిమా క్లయిమాక్స్ విషయంలో రానా దర్శకుడు తేజ కలిసి ఏదో ప్రయోగం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఈ విషయంలో వాళ్లిద్దరు కాస్త గట్టి ధైర్యమే చేస్తున్నారని వినికిడి. తేజ చెప్పడం, రానా ఓకే అనడం, స్క్రిప్ట్ కూడా అలాగే డిమాండ్ చేయడంతో ఏంటీ సెంటిమెంట్ క్లయిమాక్స్ ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సినిమా విడుదలయితే  కానీ, అదేమిటో? అది ఏ మేరకు విజయవంతం అవుతుందో తెలుస్తుంది. Readmore!

Show comments