వర్మ 'మెగా' బాధుడు

వచ్చింది కదా అవకాశం..ఓ మంచి మాట అనుకుందాం అని మహేష్ బాబు పాడాడు కానీ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అలా కాదు. ఎప్పుడు దొరుకుతారా? మెగా బ్రదర్స్ ఓ మాట వేసేద్దాం అని చూస్తుంటారు.

ఇప్పుడు టైమ్ వచ్చింది. గౌతమీ పుత్ర శాతకర్ణి ట్రయిలర్ అద్భుతంగా జనం ముందుకు వచ్చింది. అందుకే వర్మ ఇక మొదలెట్టేసారు. ట్వీట్ లతో మెగాస్టార్ పై ఆట. 

తొలి ట్వీట్ గా..

ఇలా అంటే మెగాభిమానులకు ఎంత మండాలో అంతా మండదా? అయినా వర్మ ఊరుకోలేదు. మరో ట్వీట్ Readmore!

కత్తికన్నా మెగా షార్ప్ ట్రయిలర్ అనడంలోనే వర్మ ఉద్దేశం తెలిసిపోతోంది..కత్తి సినిమా రీమక్ నే కదా ఖైదీ నెం 150 అంటే. పైగా మెగా షార్ప్ అన్నపదం ఒకటి. మళ్లీ అక్కడితో కూడా ఆగకుండా

అంటూ ఇంకో ట్వీట్ చేసారు. అలా కూడా ఊరుకోకుండా అభిమానులను ఉద్దేశించి, మీరు నిజంగా అభిమానులైతే మెగాస్టార్ కు ఇలాంటి సినిమాలు చేయమని చెప్పండంటూ ఇంకో ట్వీటు విసిరారు

ఇక్కడితో ఆపుతారో..మరింకా ముందుకు వెళ్తారో చూడాలి. 

Show comments