సినిమా జనాలు.. కమ్మయినా.. కాపు అయినా.. రెడ్లతో సంబంధం అంటే ఏమిటో మక్కువ చాలా ఎక్కువ అనిపిస్తుంది. దాదాపుగా సినిమా సెలబ్రిటీలు చాలా మంది రెడ్లనే పెళ్లి చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, మోహన్ బాబు కుమారులు మనోజ్, విష్ణు, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్.. వీళ్లంతా రెడ్ల అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లే.
ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా అదే బాట పడుతున్నట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. నగరానికి చెందిన ఓ ప్రముఖ రెడ్డి కుటుంబానికి చెందిన మనవరాలని అఖిల్ ప్రేమిస్తున్నట్లు ఈ రోజు వార్తలు వెలువడ్డాయి. నిజానికి నాగార్జునకు రెడ్లతో మంచి వ్యాపార సంబంధాలు వున్నాయి. అవి ఇప్పుడు కుటుంబ సంబంధాలుగా కూడా మారుతున్నాయన్న మాట.