హలో విశాఖ అంటున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ అంటే స్పెషల్. ఆయన వీలైనంతగా మాధ్యమాలను ఉపయోగించుకుని ప్రజలతో మాట్లాడేందుకు చూస్తారు. మన్ కీ బాత్ అయినా మరోటి అయినా ఆయన స్టైలే వేరు. 

ఇదిలా ఉంటే ఈసారి ప్రధాని మరో వినూత్న కర్యక్రమం ద్వారా వర్చువల్ గా జనాలను మీట్ కాబోతున్నారు. దాని కోసం ఆయన విశాఖను ఎంచుకున్నారు. హలో విశాఖా అంటూ ప్రధాని పలకరించనున్నారు. 

విశాఖలో విద్యుత్ వినియోగదారులతో ప్రధాని ముఖాముఖీ కార్యక్రమం వర్చువల్ ద్వారా ఈ నెల 30న జరగనుంది. ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్య పవర్-2047 అన్న పేరుతో ఆయన ఈ వర్చువల్ భేటీని నిర్వహిస్తున్నారు.

ఇందుకోసం ఏయూ కాన్వకేషన్ హాల్ రెడీ అవుతోంది. దాదాపుగా మూడు వందల మంది వినియోగదారులతో ప్రధాని ఈ వర్చువల్ భేటీలో మాట్లాడుతారు అని అధికార వర్గాలు తెలియచేశాయి. విద్యుత్ రంగంలో అమలవుతున్న సంస్కరణల గురించి జనాలతో మోడీ ముచ్చటిస్తారు. Readmore!

Show comments

Related Stories :