వంశీ...ఇదే మిగిలిందా? ఇక?

వంశీ అంటే మంచి ఫన్. వంశీ అంటే క్లాస్ పాటలు, చిత్రీకరణ. వంశీ అంటే గోదావరి గలగలల హాస్యం. అలాంటి వంశీ చాలా కాలంగా బాక్సాఫీస్ దగ్గర గజనీ దండయాత్రలు చేస్తున్నారు. కొన్ని సినిమాలయితే అరడజను ముహుర్తాలు పెట్టుకుని, ఆఖరికి విడుదలయ్యాయో లేదో కూడా తెలియని పరిస్థితి. కనీసం ఎవరూ సమీక్ష కూడా రాయని వ్యవహారం. 

అలాంటి వంశీ ఓ మంచి ప్రాజెక్టులో పడ్డారు. అలనాటి ఆయన క్లాసిక్ లేడీస్ టైలర్ కు సీక్వెల్ ఫ్యాషన్ డిజైనర్. పైగా మంచి ప్రొడ్యూసరే దొరికారు. మరి అలాంటి సినిమా ఎలా వుంటుందో? ఎలా వుండబోతోందో? అన్నది ఫస్ట్ లుక్ నే చెబుతుంది. కానీ ఫ్యాషన్ డిజైనర్ కు వదిలిన ప్రీ లుక్ ఫొటో, ఫస్ట్ లుక్ ఫొటో రెండూ కూడా ఏదో కుర్రకారును సినిమా కేసి లాగే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి తప్ప, ఇది వంశీ సినిమా అని చెప్పే ప్రయత్నం కనిపించలేదు. 

అయితే ఈ  మీదా, కిందా కొలతలు కుర్రకారు ఆఢియన్స్ ను బాగానే ఆకట్టకుంటాయి. సినిమాకు నిర్మాతలు ఆశించిన బజ్ తీసుకువస్తాయి. అయితే సినిమాలో ఈ కొలతలే వుంటే, వంశీ సినిమాకు తీసివేతలు అవుతాయి. వంశీ సినిమా అంటే కచ్చితంగా వంశీ సినిమాలా వుండాలి. అలా వుంటుందనే వంశీ అభిమానుల ఆశ. ఇలా కాకపోతే, ఇదే ఆయనకు ఆఖరి యుద్దం అయిపోయే ప్రమాదం వుంది. ఎందుకంటే ఇలాంటి చాన్స్ మళ్లీ రాదు.

Readmore!
Show comments