తెలంగాణకు లక్ష్మీ నారాయణ?

కొన్ని కొన్ని విషయాలకు మధ్య లింక్ వుండొచ్చు, వుండకపోవచ్చు కానీ, కాస్త అనుమానాలు అయితే రేకెత్తిస్తాయి. సిబిఐ లక్ష్మీనారాయణ అంటే చాలు తెలుగు నాట ఫుల్ పాపులర్. అటు జగన్ కేసుతో అయితేనేమి, ఆయన సోషల్ సర్వీస్ ఏక్టివిటీస్ తో అయితేనేమి ఆయన పేరు తెలియని వారు లేరు. అయితే జగన్ కేసు నుంచి కొన్నాళ్ల తరువాత ఆయన మహరాష్ట్రలో వేరే పదవికి బదిలీ అయ్యారు. 

అయితే లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఆయన మళ్లీ తెలంగాణకు బదిలీపై రావచ్చు అన్నది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి. నిజానికి ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్ లో పెరిగారు. అందువల్లేనా? లేక మరే కారణాల రీత్యా, ఆయన హైదరాబాద్ కు రావాలని కోరుకుంటున్నారన్నది తెలియదు. అదే విధంగా ఆయన ఏ హోదాలో ఇక్కడకు వస్తారో ఇంకా తెలియదు. కేవలం ఆయన తెలంగాణకు డిప్యూట్ చేయమని కేంద్రాన్ని కోరుతున్నారనే వార్తలు వినవస్తున్నాయి.

కానీ మరి ఆయన ఇక్కడకు ఏ హోదాలో వస్తారో? పైగా జగన్ కేసులు అన్నీ తెలంగాణ పరిథిలోనే వున్నాయి. మరోపక్క ఎన్నికల లోగా జగన్ మళ్లీ జైలుకు వెళ్తాడని తెలుగుదేశం వర్గాలు ధీమాగా వున్నాయి. ఈ మేరకు రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో జెడి లక్ష్మీనారాయణ తెలంగాణ వస్తారన్న వార్తలు మరింత ఆసక్తికరం అన్నది మాత్రం వాస్తవం.

Readmore!
Show comments

Related Stories :