బాహుబలికి నో చెప్పిన సోనమ్ కపూర్?

మొన్నటికిమొన్న కరణ్ జోహార్ ఇచ్చిన కాక్ టైల్ పార్టీలో ప్రభాస్, అలియాభట్ కలిశారు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు.

దీంతో సాహో సినిమాలో అలియా నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాకముందే మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈసారి సోనమ్ కపూర్ వంతు.

సాహో సినిమాలో హీరోయిన్ వేషం కోసం సోనమ్ కపూర్ ను కూడా సంప్రదించారట. అయితే మేటర్ ఇక్కడితో ఆగలేదు.

ఈ ఆఫర్ ను సోనమ్ కపూర్ తిరస్కరించిందనేది లేటెస్ట్ అప్ డేట్. అవును.. తన క్యారెక్టర్ కు పెద్దగా ప్రాధాన్యం లేదని సాహో ప్రాజెక్టులో చేయనని చెప్పేసిందట సోనమ్.

అది నిజమే. సాహో సినిమా కథ మొత్తం ప్రభాస్ చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే బాలీవుడ్ హీరోయిన్ ఉంటే సినిమా రేంజ్ పెరుగుతుందని యూవీ క్రియేషన్స్ భావిస్తోంది. పైగా హిందీలో కూడా రిలీజ్ అనుకుంటున్నారు కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని మేకర్స్ ఫీలింగ్.

కానీ ఇప్పటివరకు సాహో సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు. ఎవరూ ముందుకు రాకపోతే అనుష్కనే మరోసారి రిపీట్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. ప్రభాస్ అడిగితే అనుష్క నో చెప్పదనే విషయం అందరికీ తెలిసిందే కదా.

Show comments