ఆఫ్ ద రికార్డ్: రోశయ్య.. కాసయ్య!

రోశయ్య అప్రతిష్ట..

తమిళనాడు గవర్నర్‌గా పలు సంవత్సరాలు అధికారంలో ఉన్న రోశయ్య చివరి రోజుల్లో చెడ్డ పేరు తెచ్చుకున్నారని వినికిడి. తమిళనాడులో వైస్ ఛాన్సిలర్ల నియామకంలోనూ ఆయన చక్రం తిప్పారంటున్నారు. ఇక ప్రారంబోత్సవాలకు కూడా ఆయన ఊరికే హాజరయ్యేవాడు కాదని ప్రచారం జరుగుతోంది. రోశయ్య తరఫున అపాయింట్ మెంట్లు ఫిక్స్ చేసే వారు ఎంతో కొంత తణమో పణమో పుచ్చుకోకుండా ఉండని పరిస్థితి ఏర్పడింది. అయితే నిజంగా రోశయ్యకు ఇది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా చెప్పలేము కాని ముఖ్యమంత్రి పదవి చేసిన రోశయ్య గవర్నర్ పదవికి వన్నె తెచ్చే పనులు మాత్రం చేయలేదు. 

చక్రం తిప్పుతున్న విద్యాసాగర్…
తమిళనాడు గవర్నర్‌గా తాత్కాలిక పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచీ విద్యాసాగర్ రావు చక్రం తిప్పుతున్నారు. మహారాష్ర్ట గవర్నర్‌గా ఆయన చక్కం తిప్పినందువల్లే రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు తమిళ రాజకీయాలను కూడా ఆయన బాగా జీర్ణించుకున్నారు. విద్యాసాగర్ రావును తమిళనాడుకే పరిమితం చేసి మహారాష్ర్ట గవర్నర్‌గా మరొకర్ని నియమించే అవకాశాలు లేకపోలేదు. నిజానికి ఇటీవల చాలామంది గవర్నర్‌లను నియమించినా తమిళనాడు గవర్నర్ పదవి మాత్రం భర్తీ చేయకుండా విద్యాసాగర్ రావుతోనే నడిపించారు. అనతికాలంలోనే విద్యాసాగర్ రావు మోడీకి సన్నిహితుడుగా మారారు.

 మైసూరా ఎక్కడ…
చాలా కాలంగా సీనియర్ కాంగ్రెస్ నేత మైసూరా రెడ్డి కనపడడం లేదు. ఆయన ఇటీవల సెంట్రల్ హాలులో తిరుగుతూ కనపడుతున్నారు. వైసీపీ ఎంపీలు ఆయనను పలకరించినా పెద్దగా పట్టించుకోవడం లేదు. వైసీపీ గురించి మైసూరా మాట్లాడడం తగ్గించారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా చక్రం తిప్పగల సమర్థత ఉన్న మైసూరా పదవి లేకపోగా చేరిన పార్టీలో గౌరవం లేక... బయటికి వచ్చి భవిష్యత్ కార్యాచరణ కోసం వెతుకుతున్నారు. మళ్లీ తెలుగుదేశం వైపు ఆయన మొగ్గు చూపుతున్నారేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

Show comments