నయన్ అంటే అంత భయమా?

వెంకీ లాంటి సీనియర్ హీరో సినిమాకే ట్రబులిస్తోంది హీరోయిన్ నయనతార. ఇది ఇవ్వాళ్టి విషయం కాదు. సినిమా ప్రారంభమైన నాటి నుంచీ ఇంతే. ఫంక్షన్ అని, క్రిస్మస్ అనీ ఇలా తరచు షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చింది నయన తార వల్లే అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. లేదూ అంటే, ఈ సినిమా ఎప్పటికో పూర్తి కావాలి. మధ్యలో వెంకటేష్ సిక్ నెస్ కూడా కాస్త అడ్డం పడింది. 

ఏదో మొత్తానికి అంతా ఫినిష్ చేసి పాట మాత్రమే బకాయి అనుకుంటే, తనకు సంబంధం లేదు, ఇచ్చిన డేట్లు అయిపోయాయి అన్నట్లు మారాం చేస్తోంది నయనతార. ఈ విషయం ఇండస్ట్రీలో బాహాటంగా డిస్కషన్ లో వున్న పాయింట్ నే. కేవలం ఈ పనిమీదనే దర్శకుడు మారుతి చెన్నయ్ వెళ్లారన్న సంగతి తెలిసిందే. మరి నిర్మాతల వైపు నుంచి మాత్రం 'అబ్బే..అసలు నయన్ తో సమస్యే లేదు..ఎవ్విరిథింగ్ ఈజ్ ఫైన్' అనే మాటలు ఎందుకు వెలువడుతున్నట్లు? 

సమస్యేమీ లేదు సినిమా అనుకున్న ప్రకారం 29కి వచ్చేస్తుంది అని చెప్పడం వేరు. నయన్ తో సమస్యేమీ లేదు అని చెప్పడం వేరు. నయన్ ఇబ్బంది పెడుతున్నా కూడా అంత పెద్ద సంస్థ, అంత పెద్ద హీరో, పాపులర్ డైరక్టర్ ఎవరూ మాట్లాడకుండా మౌనంగా సహిస్తూ, ఏదో విధంగా ఆమెను రప్పించి, ఫినిష్ చేయాలని చూస్తున్నారు ఎందుకో?

Show comments