'బాహుబలి'పై ఆమె 'నో కామెంట్‌'

'బాహుబలి' సినిమా కోసం ముందుగా శివగామి పాత్రలో శ్రీదేవినే అనుకున్నాడు దర్శకుడు రాజమౌళి. అయితే, శ్రీదేవి అందుకు ఒప్పుకోలేదు. కారణాలేవైతేనేం, శ్రీదేవి వద్దనుకున్న శివగామి పాత్ర రమ్యకృష్ణకి దక్కింది.. ఆ పాత్రలో ఇప్పుడు ఆమెను తప్ప, ఇంకొకర్ని ఊహించుకోలేని పరిస్థితి. శివగామిగా రమ్యకృష్ణ తెరపై చెలరేగిపోయిన తీరు అద్భుతం అని తీరాల్సిందే. 

ఇంతకీ, 'బాహుబలి' సినిమాలో ఆఫర్‌ని శ్రీదేవి ఎందుకు వదిలేసుకుంది.? ఈ ప్రశ్నను శ్రీదేవి ముందుంచితే, సింపుల్‌గా 'నో కామెంట్‌' అనేసింది శ్రీదేవి. 'సమయం వచ్చినప్పుడు స్పందిస్తా..' అంటూ శ్రీదేవి, 'బాహుబలి' విషయమై సమాధానాన్ని తాజాగా దాటవేసిందట.

'బాహుబలి' తెలుగు సినిమా మాత్రమే కాదు, అంతకు మించి. బాలీవుడ్‌ రికార్డుల్ని సైతం 'బాహుబలి' తిరగరాసేసింది. 'శివగామి' పాత్రలో శ్రీదేవి నటించి వుంటే, ఆమె కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్‌ మూవీ అయ్యేదే. 

ప్రస్తుతం 'మామ్‌' సినిమా పనుల్లో బిజీగా వుంది శ్రీదేవి. ప్రస్తుతానికి 'నో కామెంట్‌' అనేస్తున్నా, 'మామ్‌' ప్రమోషన్స్‌ కోసం శ్రీదేవి ఎక్కడికి వెళ్ళినా 'బాహుబలి' ప్రశ్న వస్తుంది గనుక, ముందు ముందు స్పందించక తప్పదు. మరి, శ్రీదేవి 'బాహుబలి' గురించి ఏమంటుందో వేచి చూడాల్సిందే.

Show comments