అరవింద్ చేతుల్లో అభినేత్రి

మంచి సినిమా, కాస్త ప్రామిసింగ్ సినిమా అని అనిపిస్తే చాలు టక్కున పట్టేసుకునే డిస్ట్రిబ్యూటర్లు ఒకరిద్దరు వున్నారు టాలీవుడ్ లో. అలాంటి వాళ్లలో అల్లు అరవింద్ ఒకరు. ఇప్పుడు ఆయన దృష్టి అభినేత్రి మీద పడింది. మూడు భాషల్లో ప్రభుదేవా-తమన్నా-సప్తగిరి-సోను సూద్ లాంటి స్టార్ కాస్ట్ తో రెడీ అయిన సినిమా ఇది. ఎమ్ వివి పతాకంపై కోనవెంకట్ సమర్పణలో తయారైన ఈ సినిమాను అరవింద్ చేతుల్లోకి తీసుకున్నారు. 

మరి టేకోవర్ చేసారో, పంపిణీ బాధ్యతలు తీసుకున్నారో కానీ, టోటల్ గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గీతా డిస్ట్రిబ్యూటర్స్ నే ఈ సినిమాను పంపిణీ చే్స్తుంది. దసరా బారిలో ప్రేమమ్, మా ఊరి రామాయణం, జాగ్వార్ సినిమాలతో పోటీ పడబోతొంది అభినేత్రి.  ఈ సినిమాకు సెన్సారు టాక్ అయితే బాగానే వుంది మరి. చూడాలి జనం రియాక్షన్ ఎలా వుంటుందో?

Readmore!
Show comments

Related Stories :