విశాఖ ఆరిజన్ తెలుగు అమ్మాయి కొంగర సుధా ప్రసాద్ హిందీ, తమిళభాషల్లో అందించిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ సాలా ఖండూస్. ఆర్ మాధవన్ హీరో. ఈ సినిమా మీద విపరీతంగా మనసుపడ్డాడు మన విక్టరీ వెంకటేష్. ప్రాజెక్టు మొత్తం ఫిక్సయిపోయిన సంగతి తెలిసిందే.
మారుతి డైరక్షన్ లో బాబు బంగారం ఫినిష్ అయిపోయింది. విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు వెంకీ ఫ్రీ. అందుకే ఆగస్టు నుంచి సాలా ఖండూస్ తెలుగు వెర్షన్ స్టార్ట్ చేస్తున్నారట. డైరక్టర్ గా సుధా ప్రసాద్ నే వుంటారు. హీరోయిన్ కూడా మాతృకలో వేసిన అమ్మాయే. రితికసింగ్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తారు.
ఈ సినిమాను ఆగస్టులో ప్రారంభించి మూడు నెలల్లో షూట్ పార్ట్ ఫినిష్ చేయాలని షెడ్యూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఎలా లేదన్నా డిసెంబర్ వేళకు రెడీ అయిపోతుందేమో సినిమా? తెలుగులో వర్కింగ్ టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు.