కరణం మల్లీశ్వరి కాదు.. మన సమంతే.!

మన తెలుగమ్మాయి.. మన కరణం మల్లీశ్వరి గుర్తుందా.? ఒకప్పటి వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌. ఆ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ని తలపించేస్తోందిప్పుడు సమంత. నిజ్జంగా నిజమే. ఏ సినిమా కోసమో, లేదంటే సరదా కోసమోగానీ, సమంత ఏకంగా 72 కిలోల బరువుని లిఫ్ట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని సమంత స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో ద్వారా వెల్లడించింది. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే ఎవరైనా. 

చక్కనమ్మ చిక్కినా అందమే.. అలాగే బొద్దుగా తయారైనా అందమే. కానీ, కండలు తిరిగితే కాస్త కష్టమే మరి. ఇంతకీ, సమంత ఇలా ఎందుకు ఇంత బరువుని పైకెత్తాల్సి వచ్చిందో.! ఏమోగానీ, సమంత వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయింది. అలా వైరల్‌ అవడానికే కదా, సమంత ఇదంతా చేసింది.! 

త్వరలో టాలీవుడ్‌ హీరో నాగచైతన్యని పెళ్ళాడనున్న సమంత, సినిమాల్లోనూ బిజీగానే వుందండోయ్‌. తమిళ సినిమాల్లో చాలా బిజీ అయిపోయింది. మొత్తంగా ఆమె చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. ఓ పక్క మరిది అఖిల్‌ పెళ్ళి పనులు, ఇంకోపక్క సినిమాలు.. ఈ బిజీ లైఫ్‌ నుంచి కాస్తంత ఉపశమనం కోసం జిమ్‌లో దూరేసి, ఏం చెయ్యాలో తెలియక వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్నట్టుంది కదూ.!

Show comments