చైతూ-ఇంద్రగంటి సినిమా క్యాన్సిల్?

వైవిధ్యమైన సబ్జెక్ట్ లు ఎంచుకునే క్లాస్ డైరక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ, నిర్మాత సాయి కొర్రపాటి బ్యానర్ లో నాగ్ చైతన్యతో చేయబోయే సినిమా క్యాన్సిల్ అయినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. దానికి బదులుగా నాగ్ చైతన్య అదే బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమా చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

ఇంద్రగంటి సినిమా క్యాన్సిల్ కావడం వెనుక కేవలం కథ సెట్ కాకపోవడమేనా, ఇంకేమైనా కారణాలు వున్నాయా అన్నది ఇంకా తెలియడం లేదు.  ఇదిలా వుండగా ఈ సినిమా క్యాన్సిల్ అయిన విషయం తెలిసి, హారిక హాసిని వారి సెకెండ్ బ్యానర్ సితార ఎంటర్ టైన్మెంట్స్ లో ఇంద్రగంటితో సినిమా చేసే ప్రయత్నాలు షురూ అయినట్లు తెలుస్తోంది. ఇంద్రగంటితో ఈ బ్యానర్ కు ఎప్పడో ఓ సినిమా చేయాలని మాట అయితే వుంది. 

ఇంద్రగంటి లాంటి మాంచి డైరక్టర్ ను వదులుకుని, హిట్ లకు మొహం వాచినట్లున్న యేలేటితో సినిమా చేయాలని ఇటు నిర్మాత కొర్రపాటి, అటు నాగ్ చైతన్య ఎందుకు అనుకున్నట్లో?

Show comments