భాగమతి క్లయిమాక్స్ మారింది

దర్శకుడు అశోక్ కుమార్ చెప్పిన లైన్ విని ఫిదా అయిపోయి, అనుష్కతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను తలకు ఎత్తుకుంది యువి క్రియేషన్స్. ఓ మాంచి సినిమాను అందించాలని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాణం కానిస్తోంది. అయితే ఇది అనంతగా కొనసాగుతోంది తప్ప ఫినిష్ కావడం లేదు.

దర్శకుడు అశోక్ కుమార్ ఏదోదో చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై తాజా ఖబర్ ఏమిటంటే, ఈ సినిమా క్లయిమాక్స్ మొత్తం మారుస్తున్నారట. ఇంతకు ముందు అనుకున్న క్లయిమాక్స్ కాకుండా వేరే విధమైన క్లయిమాక్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

అశోక్ కుమార్ తయారుచేసిన క్లయిమాక్స్ యువి క్రియేషన్స్ కు అంతగా నచ్చకపోవడమే ఇందకు కారణమని తెలుస్తోంది. అశోక్ కుమార్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్స్ కు, యువి అధినేతల న్యూ స్కూల్ ఆఫ్ థాట్స్ కు పొసగక ఈ పరిస్థితి వచ్చినట్లు వినికిడి.

Show comments