డిజె ఖర్చు గీత దాటుతోందా?

రాబోయే క్రేజీ ప్రాజెక్టుల్లో డిజె అలియాస్ దువ్వాడ జగన్నాథమ్ ఒకటి. బన్నీ-హరీష్ శంకర్ కాంబినేషన్ ముస్తాబవుతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే వున్నాయి. దిల్ రాజు నిర్మాత. అయితే ఈ సినిమా అనుకున్న బడ్జెట్ ను దాటేస్తోందని తెలుస్తోంది. పెద్ద సినిమాల మార్కెట్ విస్తృతం అవుతోంది. నైజాం, ఉత్తరాంధ్ర కలెక్షన్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 

అందువల్ల ఈ సినిమాకు కూడా వంద కోట్ల మార్కెట్ వుంటుంది. అందులో సందేహం లేదు. అయితే ఆ సంగతి ఎలా వున్న, ఆరంభంలో యాభై నుంచి అరవైలో మేకింగ్ కంప్లీట్ అవుతుంది అనుకున్నారట. కానీ ఇప్పుడు డెభై దాటేస్తోంతదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ సినిమాకు చాలా సెట్ లు వేయాల్సి రావడమే అని తెలుస్తోంది. రియల్ లొకేషన్ల కన్నా, సెట్ లు అయితే తమకు కావాల్సినట్లు వుండడమే కాకుండా, రిచ్ లుక్ వస్తుందని, ఆ రూట్ వెళ్తున్నారట. దీంతో కాస్త ఖర్చు పెరుగుతోందని తెలుస్తోంది.

అయినా దిల్ రాజుకు ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, పైగా కచ్చితంగా టేబుల్ ప్రాఫిట్ వెంచర్  కాబట్టి ధైర్యంగా ఖర్చు పెడుతున్నారు.

Readmore!
Show comments