4నుంచి డిజె సెట్స్ పై బన్నీ

సరైనోడు హిట్ తరువాత ఇంతవరకు బన్నీ మేకప్ వేసుకోలేదు. సెట్ మీద అడుగు పెట్టలేదు. సరైన ప్రాజెక్ట్ సెట్ కావడంలో ఆలస్యం అయింది. ఆఖరికి హరీష్ శంకర్ తో చేయాలని డిసైడ్ అయిన తరువాత కూడా అంత చకచకా పనులు జరగలేదు. ఆఖరికి మెలమెల్లగా బన్నీ లేని సీన్లు తీయడం ప్రారంభించారు. 

ఫైనల్ గా నవంబర్ 4 నుంచి బన్నీ దువ్వాడ జగన్నాధమ్ సెట్ మీద అడుగుతుపెడుతున్నాడట. ఇక చకచకా షూటింగ్ కానిచ్చేస్తారు. ఇప్పటి దాకా బన్నీలేకుండానే కొన్ని సీన్లుచేసారు. హీరో చైల్డ్ హుడ్ ఎపిసోడ్ కూడా వాటిలో ఒకటి. ఇందుకోసం 1990 నాటి పోలీస్ స్టేషన్ సెట్ కూడా వేసారు.

ఎందుకంటే 2016లో హీరోకి పాతికేళ్లు అంటే, ఫ్లాష్ బ్యాక్ కోసం ఆ మాత్రం వెనక్కు వెళ్లాలి కదా. ఇది కాక భారీ భవంతి సెట్ కూడా వేసారు. వీటిలో ఈ నెల 4 నుంచి బన్నీ ఏక్టింగ్ ప్రారంభవుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ కు టార్గెట్ చేసి తయారుచేస్తున్నారు.

Show comments