నయన్...మరీ అంత డిమాండ్ నా?

నయన తార టైమ్ ఓ రేంజ్ లో వుంది కదా.. శ్రియ, త్రిష, అనుష్క ఇలా మిడిల్ ఏజ్డ్ హీరోయిన్లు ఇద్దరు ముగ్గురే వున్నారు. వీళ్లలో నయన్ వ్యవహారం వేరు. స్టిల్ తన యంగ్ హీరోల పక్కన కూడా నటించగలిగే అందాలతో వుంది. అందుకే డిమాండ్ ఎక్కువగా వుంది. మరోపక్కన ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ హీరోల సంఖ్య ఎక్కువగానే వుంది. అందువల్ల వీళ్లందరికీ నయన్ కావాలి. 

అందుకే ఆమె తన రేట్ ను అంతకంతకూ పెంచేస్తోందట. అజయ్ తాజా సినిమా కోసం నయన్ ను అడిగారట. అంటే ఏమాత్రం తడుముకోకుండా జస్ట్ నాలుగు కోట్లు అని చెప్పేసిందట. అజయ్ సినిమా అంటే భారీగానే వుంటుంది కానీ, మరీ అలా అని నాలుగు కోట్లు కేవలం హీరోయిన్ కే ఇవ్వడమా అని కిందా మీదా అవుతున్నారట సదరు నిర్మాత.

Readmore!
Show comments

Related Stories :