దీన్ని రొమాన్స్‌ అనేద్దామా.?

రొమాన్స్‌ అంటే శృంగారం.. శృంగారం మితి మించిపోతే.. ఆ రొమాన్స్‌ని ఏమనాలి.? 'బేఫికర్‌' అనాలేమో. టైటిల్‌ 'బేఫికర్‌' గనుక, దేని గురించీ ఆలోచించలేదు సినిమాలోని రొమాంటిక్‌ జంట. ఆగండాగండీ, రొమాంటిక్‌.. అనకూడదు. ఇంకో పదం ఏమన్నా కనిపెట్టాలి. ఎందుకంటే, రొమాన్స్‌లో హద్దులన్నీ దాటేసింది 'బేఫికర్‌'గా 'బేఫికర్‌' జంట. 

'బేఫికర్‌' ట్రైలర్‌ నిండా హద్దులు దాటేసిన రొమాన్స్‌ కన్పించింది. హీరో హీరోయిన్‌ బెడ్‌ మీద రొమాన్స్‌ని కొనసాగిస్తూనే, అక్కడ్నుంచి చెరో దుప్పటి కప్పేసుకుని, బయటకొచ్చేస్తారంతే. రణ్‌వీర్‌సింగ్‌, వాణి కపూర్‌ రొమాన్స్‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ.. అంటే అలా ఇలా కాదు, ఓ రేంజ్‌లో కుదిరింది. ఇది పైత్యం అనాలా.? ఇంకేమన్నా అనాలా.? ఏదన్నా అనుకోండి, 'బేఫికర్‌'గా ఈ జంట, సరికొత్త రొమాన్స్‌ పండించేసింది. 

ఇప్పటిదాకా బాలీవుడ్‌లో వచ్చిన రొమాంటిక్‌ సినిమాలు ఓ వైపు, 'బేఫికర్‌' ఒక్కటీ ఇంకో వైపు.. అంటూ ఇంతకు ముందే ఈ చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేసేసింది. దానికి ఏమాత్రం తగ్గలేదు ట్రైలర్‌. సినిమా ప్రమోషన్‌నే లిప్‌ టు లిప్‌ కిస్సులతో మొదలెట్టేసిన 'బేఫికర్‌', ట్రైలర్‌లోనూ దాన్ని కొనసాగించండి. రొమాన్స్‌ అనండీ, ఇంకేమన్నా అనండీ 'బేఫికర్‌' టీమ్‌కి బేఫికర్‌.. బేషరమ్‌ కూడా.!

Show comments