నాగశౌర్య సొంత బ్యానర్

హీరో నాగ శౌర్య ఫ్యామిలీ కూడా సినిమా నిర్మాణంలోకి దిగుతోంది. మొదటి సినిమాను నాగశౌర్య హీరోగా ప్రారంభిస్తున్నా, తరువాత వీలయినన్ని చిన్న, మీడియం సినిమాలను అవకాశం దొరికిన హీరోలతో చేయాలన్నది బ్యానర్ అధినేత,శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ఐడియా. 

తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమాకు ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వెంకట్ ను డైరక్టర్ గా పరిచయం చేస్తున్నారు. నాగశౌర్య పక్కన ఓ క్రేజీ యంగ్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా కోసం నాగశౌర్య కొత్తగా కనిపిస్తాడట. సిక్స్ ప్యాక్ కాకపోయినా, దాదాపు అంత ప్రయత్నమూ చేస్తున్నాడు. 

మొన్నటికి మొన్న సాయి కొర్రపాటి సినిమా కోసం గెడ్డం పెంచిన శౌర్య ఆ సినిమా క్యాన్సిల్ అయినా ఆ కొత్త గెటప్ ను ఈ సినిమా కోసం ట్రయ్ చేస్తున్నాడు. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్టుతో పాటే మరో చిన్న సినిమా కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి కూడా కొత్త దర్శకుడే పనిచేస్తారు.

Show comments