ఈ వీక్‌ ట్రేడ్‌ టాక్‌

పెద్ద నోట్ల రద్దుతో సినిమా విపణి కంపించిపోయింది. థియేటర్లలో జనాలు లేక వారిని ఆకట్టుకోవడానికి డిస్కౌంట్‌ రేట్లు ప్రకటించే పరిస్థితి నెలకొంది. డెబ్బయ్‌ రూపాయలమ్మే బాల్కనీ టికెట్‌ని ఇప్పుడు ముప్పయ్‌ రూపాయలకి ఇస్తున్నారు. అయినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉందట.

పట్టణాల్లో, మల్టీప్లెక్సుల్లో కలక్షన్లు ఫర్వాలేదనిపిస్తున్నా పల్లెల్లో మాత్రం పరిస్థితి కడు దయనీయంగా వుంది. గతవారం విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో చిత్రానికి టాక్‌ బాగానే వచ్చింది. కానీ నైజాం మినహా అన్ని చోట్ల దీనికి కలెక్షన్లు ఆశాజనకంగా లేవు. 

మిగిలిన సినిమాలేవీ జనాన్ని రాబట్టలేకపోవడంతో చాలా థియేటర్లు మూత పడ్డాయి. వచ్చే రెండు, మూడు వారాల వరకు పరిస్థితి ఇంతేనని అంటున్నారు. అయినప్పటికీ ధైర్యం చేసి నిఖిల్‌ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాన్ని ఈ వారం రిలీజ్‌ చేసారు. దీనికైనా వసూళ్లు వస్తాయో లేదో అనేది చెప్పడం ఇప్పుడే కష్టం.

Show comments