స్పైడర్ సేల్ స్టామినా 150 కోట్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు-ఏస్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న స్పైడర్ మార్కెటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఆంధ్రలో గుంటూరు, నెల్లూరు, 36 కోట్ల రేషియోలో విక్రయించేసారు. ఓవర్ సీస్ 20 కోట్లకు అమ్మేసారు. ఆల్ లాంగ్వేజెస్ శాటిలైట్ 26 కోట్లకు పైగా రేటుకు ఇచ్చేసారు. తాజాగా నైజాం హక్కులను 25 కోట్లకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజుకు ఓకె అయినట్లు వినికిడి.

అయితే మంచి రోజు చూసుకుని, అడ్వాన్స్ తీసుకున్నాక ప్రకటిస్తారు. సీడెడ్ మాత్రం చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్ వి ప్రసాద్ తీసుకుంటారు. దీని బుక్ వాల్యూ ఎంతన్నది ఇంకా తెలియాల్సి వుంది. ఎలా లేదన్నా 15 కోట్లకు పైగానే వుంటుందని అంచనా.

స్పైడర్ కు నిర్మాణ ఖర్చే 130 కోట్ల వరకు అవుతోంది. సినిమా టోటల్ మార్కెట్ 150 కోట్ల వరకు వుండే అవకాశం కనిపిస్తోంది. తమిళ వెర్షన్ కు 20 నుంచి 25 కోట్ల వరకు రావాలని చూస్తున్నారు. ఈ లెక్కన ఎంత తక్కువలో వేసుకున్నా, ఉభయ తెలుగు రాష్ట్రాలు (36,,15,,25), ఓవర్ సీస్ (20), తమిళం (20)శాటిలైట్ (26) ఇంకా అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ రైట్స్, అదర్ ఏరియాలు, ఇలా అన్నీ కలుపుకుంటే 150 కోట్లు దాటేస్తోంది స్పైడర్.

Show comments