శశికళ.. అందరి మనిషీ..!

అటు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, ఇటు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి.. ఇద్దరికీ లేఖలు రాసింది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ. అన్నాడీఎంకే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తుంది, తమిళనాడుకు ముఖ్యమంత్రి అవుతుంది.. అనే అంచనాలను కలిగిన ఈమె.. జయ మరణం సమయంలో నివాళి ఘటించడానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.

ఇందుకోసం ప్రధానమంత్రి మోడీకి, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కు, రాష్ట్రపతి ప్రణబ్ కు ప్రత్యేకంగా లేఖలు రాసింది శశికళ. జయ మరణ సమయంలో.. వీరు తరలి వచ్చి, జయకు నివాళి ఘటించడం, తమకు ఓదార్పునివ్వడం భావోద్వేగానికి గురి చేసిందని శశికళ ఆ లేఖల్లో పేర్కొన్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలిద్దరికీ శశికళ లేఖలు రాయడం. దీంతో.. ఆమె ఇరు పార్టీలకూ సమదూరం పాటిస్తోందనే మాట వినిపిస్తోందిప్పుడు. రాహులే కదా.. అని లైట్ తీసుకోకపోవడాన్ని గమనించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే.. జయ మరణంతో ఆమెపై నమోదైన అక్రమాస్తుల కేసులు కొట్టివేతకు గురయ్యే అవకాశాలు లేవనే మాట వినిపిస్తోంది. ఆ కేసులో ప్రధాన దోషి జయ మరణించినా.. శశికళ, ఇళవరసి.. వంటి వాళ్లంతా విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే శిక్ష పడినా, ఆ తర్వాత మరో కోర్టు వీరందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఆకేసులన్నీ ఇప్పుడు సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి.  Readmore!

అన్నాడీఎంకే పీఠం విషయంలోనూ.. తమిళనాడు సీఎం పీఠం విషయంలోనూ.. శశికళ మరీ దూకుడుగా వెళ్లే అవకాశాలకు ఈ కేసులు బ్రేకులు వేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Show comments

Related Stories :