బ్యాంక్ క్యూ లో.. రాహుల్ గాంధీ!

నోట్ల మార్పిడి విషయంలో ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. నాలుగు వేల రూపాయల కోసం బ్యాంక్ క్యూలో నిలుచుని ఆశ్చర్యపరిచాడు. దేశ ప్రజల్లో ఎక్కువమంది బ్యాంకుల ముందు క్యూల్లోనే ఉన్న తరుణంలో రాహుల్ గాంధీ కూడా వరసలో నిలబడటం ఆసక్తికరంగా ఉంది. 

ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లోని బ్యాంకు ముందు ఉన్న క్యూలో రాహుల్ నిలుచున్నాడు. వీవీఐపీ స్టేటస్ ఉన్నా, రాహుల్ సామాన్యులతో పాటు నిలబడ్డాడు. ఈ సందర్భంగా క్యూలో ఉన్న ఇతర ప్రజలు రాహుల్ తో షేక్ హ్యాండ్ కోసం పోటీలు పడ్డారు. సెల్ఫీలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాడు రాహుల్ గాంధీ. ఈ నోట్ల మార్పిడి తో సామాన్య ప్రజలు ఇబ్బంది పడటమే తప్ప మరేం ప్రయోజనం లేదని ఆయన అన్నాడు. ఈ చర్యతో పేదలు ఇబ్బంది పడుతున్నారని.. రెండు వేల రూపాయల నోటును తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి? నల్లధనానికి ఇది ప్రోత్సాహకం కాదా? అని రాహుల్ ప్రశ్నించాడు. 

Show comments