రామోజీ అగ్రహారంలో బన్నీ

పెద్దగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. రామోజీ ఫిల్మ్ సిటీలో మాంచి అగ్రహారం ఇంటి సెట్ వేసారు. అందులో అల్లు అర్జున్ ఫుల్ స్పీడ్ తో షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదంతా దువ్వాడ జగన్నాధమ్ సినిమా కోసమే. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ బ్రాహ్మిన్ బోయ్. అదుర్స్ లో ఎన్టీఆర్ వేసిన క్యారెక్టర్ కు ఎక్స్ టెన్షన్ లాంటిది. 

మరి ఈ బ్రాహ్మిన్ క్యారెక్టర్ కోసం ఏకంగా ఓ అగ్రహారమే తయారుచేసేసారు రామోజీ ఫిల్మ్ సిటీలో. అక్కడ ప్రత్యేకంగా ఓ ఇల్లు కూడా కట్టారు. విజయవాడ ప్రాంతంలో వెనకటికి కనిపించే బ్రాహ్మిన్స్ హవుస్ మాదిరిగా. ఈ సెట్ లో చాలా ఫాస్ట్ గా షూట్ జరుగుతోంది.  

వాస్తవానికి ఈ అగ్రహారం ఏంబియన్స్ రావడం కోసం కేరళకో మరో చోటికో వెళ్దామని అనుకున్నారట. కానీ ఎక్కడా సరైనది దొరక్క ఆఖరికి సెట్ తో ఫిక్సయిపోయారట. అయితే తీరా సెట్ వేసి చూసాక, ఇదే బాగుందని, మాంచి లుక్ వచ్చిందని బన్నీ అండ్ కో ఫీలయినట్లు వినికిడి.

Show comments