సమంత తెగేదాకా లాగుతోందా?

ప్రయివేటు బతుకులు ఎలా వున్నా, పబ్లిక్ లో మాత్రం కాస్తయినా పద్దతిగా వుండాలి. కానీ సమంత బేబీ కి మాత్రం ఆ విషయం అస్సలు పట్టదు. తన ధోరణి తనదే. అదృష్టం బాగుండి, నాగా చైతన్య లాంటి ప్రేమకు విలువిచ్చే మగాడికి భార్య అవుతోంది. అక్కినేని లాంటి పెద్ద కుటుంబానికి కోడలు అవుతోంది.

అక్కడ ఆల్ రెడీ రోల్ మోడల్ లాంటి ఓ మాజీ హీరోయిన్ వుంది. అక్కినేని అమల. పెళ్లికి ముందు ఎలాంటి సినిమాలు వేసినా, పెళ్లయిన తరువాత ఎంత పద్దతిగా వుంటోంది? ఎలాంటి పేరు తెచ్చుకుంది?

కానీ సమంతకు అవేవీ పట్టడం లేదు. తను, తన చిత్తానికి పోస్ట్ చేసే ఫోటోలు అంతే. అప్పటికి ఆ మధ్య నాగా చైతన్య అననే అన్నాడు. తనకు సమంతలో నచ్చని విషయం అదే అని.

అయినా అడ్జస్ట్ కావడం అలవాటు చేసుకుంటున్నా అని. మొన్నటికి మొన్న బొడ్డు కనిపించేలా ఓ హాట్ ఫోజ్ ఇస్తూ ఫొటో సెషన్ చేసింది. ఇప్పుడు తన టాప్ అండ్ బాటమ్ బికినీ ఫొటోలను సోషల్ నెట్ వర్క్ లో పెట్టింది. దీనిపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి.

పెద్దింటి కోడలు కాబోతోంది. కాస్త పద్దతిగా వుండొచ్చుగా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగా చైతన్య అడ్జస్ట్ అవుతాడు. కానీ ఎంతవరకు? అది కూడా సమంత ఆలోచించుకోవడం మంచిదేమో ?

Show comments