జయలలిత మృతి అంశం.. ముగియలేదా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి అంశంపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ స్పందించింది. డీఎంకే నేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ… జయ మృతి అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. అసలు జయలలితకు ఏమైంది? ఆమె ఎలాంటి అనారోగ్య స్థితిలో ఆసుపత్రిలో చేరారు, ఆమెకు ఏ చికిత్స అందించారు, పరిస్థితి మెరుగైందని ప్రకటించినప్పుడు ఆమె ఏ స్థితిలో ఉండినారు, మళ్లీ ఆరోగ్యం విషయమించడానికి కారణం ఏమిటి, చివరకు ఎలాంటి పరిస్థితుల్లో ఆమె మరణించారు… వంటి అంశాల గురించి శ్వేత పత్రం విడుదల చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

మరి జయ మృతి అంశంపై ప్రతిపక్షం వ్యక్త పరిచిన సందేహాలపై, చేస్తున్న డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇక జయలలిత పై విషప్రయోగం జరిగిందని కొంతమంది కోర్టుకు ఎక్కారు. జయది హత్య అని వారు వాదిస్తున్నారు. ఈ మేరకు వివిధ ప్రజా సంఘాల తరపు నుంచి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి.

ఇక జయలలిత పార్థివదేహాన్ని తవ్వితీసి, శవ పరీక్ష చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాఫిక్ రామస్వామి చెన్నై హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశాడు. జయకు జరిగిన వైద్యం గురించి నివేదికలు విడుదల చేయాలని, మూడు స్థానాల ఉప ఎన్నికల సమయంలో జయలలిత వేలి ముద్రలతో విడుదల చేసిన బీఫారాల విషయంలో కూడా ఈయన అనుమానాలు వ్యక్తం చేశాడు. వాటిని అనర్హమైనవిగా ప్రకటించాలని డిమాండ్ చేశాడు.

ఇక జయలలిత రక్తసంబంధీకులేమో.. శశికళ మీద విషప్రయోగం జరిగిందని వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంపై ఇంకా గుంభనంగానే ఉంది. ఎదురుదాడితోనే అందరికీ సమాధానం చెప్పవచ్చు. 

Show comments