'బాహుబలి-2' లీకు దొంగ ఎవరంటే..

రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'బాహుబలి-2'కి లీకేజీ సమస్య వెంటాడుతోంది. 'బాహుబలి-1' విషయంలోనూ లీకేజీ ఆరోపణలు తెరపైకొచ్చాయి. అప్పట్లో ఆ లీకేజీ నిజమని తేలింది. తాజాగా 'బాహుబలి-2'కి సైతం లీకేజీల బెడద తప్పలేదు. సుమారు 9 నిమిషాల నిడివిగల వీడియో లీక్‌ అయ్యిందంటూ గాసిప్స్‌ గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంపై 'బాహుబలి' టీమ్‌ స్పందించింది. సైబర్‌ సెల్‌లో 'బాహుబలి' నిర్మాతలు ఫిర్యాదు చేశారు. 

మొత్తం 9 నిమిషాల నిడివిగల వీడియో విడుదలవడం నిజమేనని, ఈ లీకేజీకి కారణం సినిమాకి గ్రాఫిక్స్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న కృష్ణ అనే వ్యక్తి కారణం అనీ పోలీసులు గుర్తించారు. అతన్ని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా. అయితే, లీక్‌ అయిన వీడియోలు బయటకు రాకుండా చిత్ర యూనిట్‌ ముందు జాగ్రత్త వహించడంతో, పెను ముప్పు తప్పిందనే భావించొచ్చు. 

అయితే, విడుదలైంది కేవలం 9 నిమిషాల వీడియో మాత్రమేనా.? లీకైన వెంటనే అది స్ప్రెడ్‌ కాకుండా కంట్రోల్‌ చేయడం వరకూ చిత్ర యూనిట్‌ సఫలమైనా, ఇప్పటికే కొంతమందికి చేరిపోయిన ఆ వీడియో ప్రభావం సినిమాపై ఏ స్థాయిలో వుంటుంది.? అసలు సినీ పరిశ్రమకి ఈ లీకేజీల జాడ్యం వదిలేదెలా.? ఏమో, కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి. 

Show comments