చిరంజీవి, దాసరి.. కథ అడ్డం తిరిగింది.!

ఏదో చేద్దామనుకుంటే.. ఇంకేదో అయ్యింది. మొదటి నుంచీ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో వ్యవహారం అనుమానాస్పదంగానే కన్పిస్తోంది. ఆయన ఎప్పుడు నిరాహార దీక్ష చేసినా అంతే. అందులో పస వుండదు.. పబ్లిసిటీ తప్ప. ఇంట్లోకి వెళ్ళి తలుపులు బిడాయించుకుని నిరాహార దీక్ష చేస్తాననడమేంటి.? తనతోపాటు తన భార్యని కూడా నిరాహార దీక్షకు దింపడమేంటి.? అని జనం ముక్కున వేలేసుకోవాల్సిందే. చివరికి తుస్సుమనిపించేయడమూ ముద్రగడకే చెల్లింది. 

ఇక, ముద్రగడ పద్మనాభంను నమ్ముకుని మాజీ కేంద్ర మంత్రులు చిరంజీవి, దాసరి నారాయణరావు, పల్లం రాజు.. రంగంలోకి దిగారు. వీరితోపాటు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితర వైఎస్సార్సీపీ నేతలూ హడావిడి చేశారు. మొత్తంగా 'పెద్ద కాపు టీమ్‌' అన్నట్లుగా ఓ టీమ్‌ని ఫామ్‌ చేశారు. ఓ సారి సమావేశమయ్యారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అల్టిమేటం జారీ చేశారు. ఇంకోసారి సమావేశమయ్యారు.. ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. ఈలోగా, చంద్రబాబు వ్యవహారం చక్కబెట్టేశారు. 

తాజాగా ఈ రోజు సాయంత్రం 'పెద్ద కాపులు' అందరూ కలిసి ఒక్క చోట సమావేశమవనున్నారట.. అదీ మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఇంట్లో. ఈలోగా, ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించేశారన్న వార్తని చంద్రబాబు సర్కార్‌ రివీల్‌ చేసింది పరోక్షంగా. రాత్రి ఫ్లూయిడ్స్‌ ఎక్కించేశామనీ, వైద్యానికి ఆయన అనుమతిచ్చారనీ డాక్టర్లు చెప్పడంతో పెద్దకాపులందరికీ మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. మరీ ముఖ్యంగా చిరంజీవికీ, దాసరి నారాయణరావుకీ ఇది పెద్ద షాకే. ఎందుకంటే, వీరిద్దరే చంద్రబాబు విషయంలో కాస్త గట్టిగా మాట్లాడారు మరి.! 

గతంలో ముద్రగడ పద్మనాభం సొంతూరు కిర్లంపూడిలో నిరాహార దీక్ష చేసినప్పుడు దాసరి నారాయణరావు ఆ గ్రామానికి వెళ్ళలేకపోయారు.. పోలీసులు అడ్డుకున్నారు. అప్పట్లో చిరంజీవి కూడా హడావిడి చేశారండోయ్‌. ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళకుండా హైద్రాబాద్‌ నుంచే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి.. ఇదిగో, ఇలా అభాసుపాలైపోయారు.  Readmore!

Show comments

Related Stories :