సినిమా విడుదలకు ముందు ప్రచారం ఒకెత్తు. విడుదలైన తర్వాత ప్రమోషన్ మరో ఎత్తు. సినిమా థియేటర్లలోకి వచ్చి ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ప్రచారం చేస్తారు ఎవరైనా. స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, కొన్ని స్టిల్స్ రిలీజ్ చేయడం, లేదంటే మేకింగ్ వీడియోస్ విడుదల చేయడం.. ఇలా ఏదో ఒక హంగామా కనిపిస్తుంది. కానీ బాహుబలి-2 సినిమా విషయంలో మాత్రం ఇదేదీ జరగట్లేదు. టోటల్ సైలెంట్.
బాహుబలి-ది కంక్లూజన్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ వీకెండ్ ముగిసింది. సినిమా యూనిట్ మాత్రం ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ చేయడం లేదు. అసలు మూవీ విడుదలైన తర్వాత ఒక్కరు కూడా మీడియా ముందుకు రాలేదు. ప్రచారం మాట అటుంచి ఫొటోలకు పోజులు కూడా ఇవ్వలేదు.
నిజానికి బాహుబలి-2 సినిమాకు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రమోషన్ అవసరం లేదు. ఆ పని మీడియానే చేస్తోంది. పైగా సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. వసూళ్లు వరల్డ్ వైడ్ అదిరిపోతున్నాయి. ఇలాంటి టైమ్ లో మళ్లీ కొత్తగా ప్రచారం చేయడం అనవసరం. అందుకే బాహుబలి యూనిట్ పోస్ట్-రిలీజ్ ప్రమోషన్ ను లైట్ తీసుకుంది. ప్రస్తుతం యూనిట్ లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ మెంట్ మూడ్ లో ఉన్నారు.