ప్రభాస్ మైనపు బొమ్మ అదుర్స్

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పెడుతున్నారనే వార్త అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. టుస్సాడ్స్ నిర్వహకులు ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి మరీ ప్రభాస్ కొలతలు తీసుకొని వెళ్లిన విషయం తెలిసిందే. బాహుబలి సినిమా షూటింగ్ లో ఉన్న టైమ్ లోనే ఈ తతంగం అంతా నడిచింది. తాజాగా ప్రభాస్ మైనపు విగ్రహం రెడీ అయింది.

ఓవైపు బాహుబలి-2 రిలీజ్, మరోవైపు ప్రభాస్ వాక్స్ స్టాట్యూ. ఇలా రెండు సూపర్ సెన్సేషనల్ ఎలిమెంట్స్ తో పండగ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ప్రస్తుతానికి ప్రభాస్ మైనపు విగ్రహానికి సంబంధించి అఫీషియల్ స్టిల్స్ రిలీజ్ కాలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది కేవలం కెమెరాతో క్లిక్ మనిపించిన పిక్ మాత్రమే.

బాహుబలి గెటప్ లో ఉన్న ప్రభాస్ మైనపు బొమ్మను చూడాలంటే బ్యాంకాక్ వెళ్లాల్సిందే. వాస్తవానికి టుస్సాడ్స్ మెయిన్ బ్రాంచ్ లండన్ లో ఉంది. చాలామంది ప్రముఖుల మైనపు విగ్రహాల్ని అక్కడ ఏర్పాటుచేశారు. అయితే ప్రత్యేకంగా సౌత్ ఆసియా ప్రముఖుల కోసం బ్యాంకాక్ లో ఈ బ్రాంచ్ తెరిచారు. ఇక్కడే ప్రభాస్ మైనపు విగ్రహం కొలువుదీరింది.

Show comments