నయన్ పంతమే నెగ్గిందా?

మారుతి-వెంకీ కాంబినేషన్ లో రెడీ అయిపోయింది బాబు బంగారం. ఈ సినిమా అంతా స్మూత్ గా జరిగిపోయినా, చివర్న చేసి హీరోయిన్ నయనతార తో కాస్త ట్రబుల్ తప్పలేదు. ఇచ్చిన కాల్షీట్ల లెక్క తప్పిందో, సరిపోలేదో, మొత్తానికి ఓ సాంగ్ బ్యాలెన్స్ వుండిపోయింది. చేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా నయన్ ససేమిరా అన్నట్లు వినికిడి. 

అందుకోసం డైరక్టర్ మారుతి ప్రత్యేకంగా చెన్నయ్ కూడా వెళ్లి వచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఆ సాంగ్ లేకుండానే బాబు బంగారం వచ్చే నెల 12న విడుదలకు రెడీ అయిపోతోంది. సినిమా అంతా ఫినిష్ చేసి చూసుకున్నాక, సాంగ్ లేకుంటేనే బాగుంటదని యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

ఫస్ట్ హాప్ లో రెండు పాటలు, సెకండాఫ్ లో మూడు పాటలు వుంటాయి. ఏమయినా నయన్ లాంటి సీనియర్ హీరోయిన్, వెంకీ లాంటి ఓ సీనియర్ హీరో సినిమాకు ఇలా ట్రబుల్ పెట్టడం ఏమిటో?

Show comments