వీళ్ల సంబంధాన్ని ఏమనాలో తెలియదు కానీ, వీళ్లు విడిపోవడానికి కారణం మాత్రం అక్రమ సంబంధమేనట! ఇదంతా కత్రినాకైఫ్ –రణ్ బీర్ కపూర్ ల ప్రేమ- బ్రేకప్ గురించి! వీళ్లిద్దరూ తమ ప్రేమబంధాల గురించి మాట్లాడిన తీరును బట్టి, వీళ్ల బ్రేకప్ కు అసలు కారణం ఏమిటో అర్థం అవుతోంది.
కత్రినా తన ఫోన్ ను తరచూ చెక్ చేసేది అనేది రణ్ బీర్ చేసే కంప్లైంట్! వీళ్లిద్దరూ తమ లవ్ నెస్ట్ లో సహజీవనం చేశారు కదా.. అప్పుడు, ఆ హీరో ఫోన్ ను ఆమె తరచూ చెక్ చేసేదట. అంటే ఎవరితో మాట్లాడాడు, ఎవరికి మెసేజ్ లు చేశాడు, ఎవరికి మెయిళ్లు పంపాడు.. అనే విషయాలను ఫోన్ తీసుకుని చెక్ చేసేదట కత్రినా. అయితే ఇలా చెక్ చేయడం తనకు ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదని రణ్ బీర్ చాలా స్పష్టంగానే చెప్పాడు.
ప్రేమలో ఉన్నప్పుడు మోసపోయిన సందర్భాలున్నాయని కత్రినా అంటోంది. అది రణ్ బీర్ చేతిలో అని ఆమె చెప్పడం లేదు కానీ, ప్రేమ బంధంలో ఉన్నప్పుడు తన పార్టనర్ వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని, దీంతో ఆ ప్రేమ బ్రేకప్ అయ్యిందని కత్రినా చెబుతోంది. రణ్ బీర్ పేరును ఆమె ప్రస్తావించలేదు. ప్రేమలో మోసపోయానని మాత్రం చెబుతోంది. దాంతో బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చింది!
ప్రేమ బంధంలో అనుభవాల గురించి వేర్వేరుగా వీళ్లిద్దరూ స్పందించిన తీరును, బ్రేకప్ కు కారణమైన రీజన్లను చెప్పిన తీరును చూస్తే మాత్రం, రణ్ బీర్ అదనపు సంబంధమే లవ్ నెస్ట్ ను ఖాళీ చేసి, వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకోవడానికి కారణమైందని స్పష్టం అవుతోంది!