స్పైడర్ లో రెండే డ్యూయెట్లు

మురగదాస్-మహేష్ బాబు కాంబినేషన్ లో స్పై థ్రిల్లర్ గా ముస్తాబవుతోంది స్పైడర్ సినిమా. ఈ సినిమా ఫుల్ యాక్షన్ తో సాగుతుంది. అందుకే పాటలకు పెద్దగా ప్లేస్ లేనట్లు తెలుస్తోంది. సినిమాలో కేవలం నాలుగే పాటలు వుంటాయి. ఫస్ట్ హాఫ్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఓ డ్యూయట్. రెండో సగంలో ఓ డ్యూయట్, మాంటేజ్ సాంగ్ వుంటాయి. రెండో సగంలో డ్యూయట్ క్లయిమాక్స్ కు ముందు వచ్చే ఫోక్ సాంగ్ టైపు. ఇదిలా వుంటే మరీ నాలుగే పాటలు వుంటే అడియో నిండుగా వుండదని, అయిదో పాటను చేర్చాలని డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ పాటను రోలింగ్ టైటిల్స్ టైమ్ లో ప్లే చేస్తే బెటర్ అన్న ఆలోచనలో వున్నారు. 

మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారి నటిస్తోందీ సినిమాలో. అలాంటి జంట నడుమ మరీ రెండే డ్యూయట్లు అంటే ఫ్యాన్స్ కాస్త ఫీలవుతారేమో? మాంటేజ్ సాంగ్ కు బదులు డ్యూయెట్ అయితేనేమో బెటర్ అంటరేమో? కానీ కథ, సిట్యువేషన్ బట్టి మురుగదాస్ అలా నిర్ణయం తీసుకుని వుంటారనుకోవాలి.

Show comments